ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. LVM-3M6 రాకెట్ ప్రయోగం సక్సెస్

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. LVM-3M6 రాకెట్ ప్రయోగం సక్సెస్

న్యూఢిల్లీ: ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. ఇస్రో ప్రయోగించిన బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ సక్సెస్ అయింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్​ను మోసుకెళ్తున్న  ఎల్ వీఎం3 ఎం రాకెట్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రోదసిలోకి పంపింది. 

బుధవారం(డిసెంబర్24) ఉదయం 8.55 గంటలకు  శ్రీహరికోట స్పేస్ నుంచి ఎల్ వీఎం3 ఎం6 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. సతీశ్  ధావన్  స్పేస్  సెంటర్  రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఎల్ వీఎం3 ఎం6 రాకెట్  బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ శాటిలైట్ నుదిగువ భూకక్ష్యలో దీనిని ప్రవేశపెట్టింది. 

అమెరికాకు చెందిన ఏఎస్ టీ స్పేస్ మొబైల్ సంస్థ డెవలప్  చేసిన 6500 కిలోల బరువున్న బ్లూబర్డ్ బ్లాక్2 శాటిలైట్ కమ్యూనికేషన్స్  శాటిలైట్. అత్యంత బరువైన కమర్షియల్ ఉపగ్రహాల్లో బ్లూబర్డ్ 2 ఒకటి. తొలిసారి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది ఇస్రో. బాహుబలి(LVM-3M6 )రాకెట్ ప్రయోగం సక్సెస్ తో శ్రీహరికోటలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.