ఢాకా: భారత్‌లోని తమ దౌత్య కార్యాలయాల ముందు జరిగిన నిరసనల నేపథ్యంలో, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళ వారం స్పందించింది. బంగ్లాదేశ్‌లో ఉన్న ఇండియన్ హైకమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది.
10 రోజుల్లో ఆయన్ను పిలిపించడం ఇది రెండోసారి. ఆరు సార్లు సమన్లు ఇచ్చారు. తాజాగా ప్రణయ్‌ను బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి అసద్ ఆలం సియామ్ పిలిపించి మాట్లాడారు. తమ ఆఫీసులపై దాడులకు యత్నించడం పట్ల బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా భద్రతా కారణాలతో ఢిల్లీ, సిలిగురిలోని దౌత్య కార్యాలయాల్లో వీసా, ఇతర కాన్సులర్ సేవలను బంగ్లాదేశ్ టెంపరరీగా నిలిపివేసింది.
