రీసెంట్‌గా ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో సూపర్ హిట్‌ను అందుకున్న అఖిల్ రాజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈషా’. తనతోపాటు త్రిగుణ్, హెబ్బా పటేల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. శ్రీనివాస్ మన్నె తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా అఖిల్ రాజ్ మాట్లాడుతూ ‘‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం కంటే ముందు ఒప్పుకున్న సినిమా ఇది. ఆడిషన్ చేసి దర్శకుడు శ్రీనివాస్ నన్ను సెలెక్ట్ చేశారు. ఈ కథ చెప్పగానే షాకింగ్‌గా అనిపించింది. నేను ఎంతో ఎంగేజ్ అయ్యాను. హారర్ థ్రిల్లర్స్ చూసే వారికి కొత్త అనుభూతినిస్తుంది. ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ థియేటర్‌లో గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తాయి. తప్పకుండా అందర్నీ భయపెట్టే సినిమా ఇది.
నిజంగా హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమాను చూడలేరేమో. ఇందులో వినయ్ పాత్రలో కనిపిస్తా. నలుగురు చిన్నప్పటి స్నేహితుల్లో నేను ఒకర్ని. త్రిగుణ్, సిరి, హెబ్బా పటేల్, మైమ్ మధులతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నా. వెర్సెటైల్ యాక్టర్ అనిపించుకోవడం నాకు ఇష్టం. డిఫరెంట్ రోల్స్ చేయాలనుంది. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. అన్‌సెట్స్‌లో తరుణ్‌భాస్కర్, అనుపమతో కలిసి ఓ సినిమా చేస్తున్నా’ అని చెప్పాడు.
