ఫిబ్రవరి 6 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో

ఫిబ్రవరి 6 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని క్రెడాయ్ హైదరాబాద్ సీనియర్ అధ్యక్షుడు ఎన్. జయదీప్ రెడ్డి అన్నారు. కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో హైటెక్స్‌‌‌‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు అన్ని రకాల ప్రాపర్టీలను ఒకే వేదికపై తీసుకొస్తున్నామని, 68 స్టాళ్లలో దాదాపు 150 ప్రాజెక్టులు డిస్‌‌‌‌ప్లే చేయనున్నట్లు వెల్లడించారు. 

ఓ హోటల్లో మంగళవారం మీడియా సమావేశంలో జయదీప్ రెడ్డి, జగన్నాధరావు, ప్రధాన కార్యదర్శి కె. క్రాంతికిరణ్ రెడ్డి, ప్రాపర్టీ షో కన్వీనర్ సుశీల్ కుమార్ జైన్, కో-కన్వీనర్ ఎన్. వేణుగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ‘పర్మినెంట్ హోజాయ్’ నినాదంతో షో నిర్వహిస్తున్నామన్నారు.