సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ

సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ

సీఏఏపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరేం చేసినా దేశంలో సీఏఏ అమలుకాకుండా అడ్డుకోలేరన్నారు ప్రధాని. దేశంలో సీఏఏ అమలు చేసి తీరుతామన్నారు. ఇది మోదీ గ్యారెంటీ అని తెలిపారు. ఇప్పటికే కొందరికి దేశపౌరసత్వం అందించినట్టు చెప్పారు. మతం ఆధారిత విభజన ద్వారా నష్టపోయిన మన దేశ పౌరులను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు మోదీ.

 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అజంఘర్ లో బహిరంగసభలో మాట్లాడారు మోదీ. 60 ఏళ్ల పాటు దేశంలో మతపరమైన విద్వేషాలు రగిలించారని, మోదీ ప్రభుత్వమే వాటికి చరమగీతం పాడిందన్నారు. ఈ ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని అన్నారు. బీజేపీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రపంచమంతా ఆశీర్వదిస్తోందని తెలిపారు ప్రధాని.