మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్

మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్

ప్రధాని మోదీపై విమర్శలు చేశారు శరద్ పవార్. మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదని విమర్శించారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ తన వద్దకు వచ్చి సాయం అడిగారని చెప్పారు. 2004 నుంచి 2014 మధ్యలో గుజరాత్ వ్యవసాయ సంక్షోభానికి చాలా సార్లు సహాయం చేశానని అప్పుడు తాను కేంద్రంలో వ్యవసాయ శాఖకు మంత్రిగా ఉన్నానని తెలిపారు.

ఒకానొక సందర్భంలో అప్పటి గుజరాత్ సీఎం తనకు ఫోన్ చేసి ఇజ్రాయెల్‌లో విశిష్టమైన వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేయాలనుకుంటున్నానని తనను కూడా ఇజ్రాయెల్ పర్యటనకు తీసుకెళ్లాలని కోరారని చెప్పారు. అలా కోరారనే అప్పుడు తాను మోదీని తీసుసుకెళ్లానని చెప్పారు. ఇప్పుడు మోదీ ఏం చెప్పినా తాను పట్టించుకోనని పవార్ అన్నారు.

గత 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు భారీగా లబ్ది పొందారని వాదిస్తూ, లోక్‌సభ ప్రచారంలో గతంలో కూడా, రైతులను విడిచిపెట్టారని, వారి సంక్షేమం కోసం ఏమీ చేయలేదని పవార్‌ని ప్రధాని మోదీ విమర్శించారు.