ఈరోజుల్లో బాడీ స్ప్రే కొట్టుకోకుండా ఇంట్లోంచి అడుగు పెట్టడం లేదు చాలామంది. ఆ అలవాటు కూడా ఒక రకంగా మంచిదే. ఎండలో, దుమ్ములో తిరగడం వల్ల వచ్చే శరీర దుర్వాసనను కొంతవరకు తగ్గిస్తుంది. అయితే.. బాడీ స్ప్రే వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో దొరికే వాటిలో ఏది పడితే అది వాడకూడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్నిరకాల బాడీస్ప్రేలు వాడాలి. ఆఫీసుకు వెళ్లేటప్పుడు పూలు, నిమ్మ ఫ్లేవర్లు బాగుంటాయి. పక్కవారికి ఇబ్బంది కలిగించకుండా ఆహ్లాదంగా ఉంటాయి. ఎండలో బయటకు వెళ్లాల్సినప్పుడు వీలైనంత వరకు గాఢత తక్కువగా ఉన్న స్ప్రే వాడాలి. లేకపోతే చర్మం మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు మీటింగులకు వెళ్లేటప్పుడు బాడీ స్ప్రే కొట్టకపోవడమే బెటర్. ఎందుకంటే.. మీటింగ్ వాతావరణాన్ని బాడీ స్ప్రే దెబ్బతీసే అవకాశం ఉంది. కొంతమంది రోజంతా సువాసనలు రావాలని ఎక్కువ స్ప్రే శరీరం మీద చల్లు కుంటారు. అది మంచిది కాదు. ఇంకో విషయం.. స్ప్రే కొనేటప్పుడు దాని తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్ కూడా గమనించండి. లేదంటే.. చర్మసమస్యలు రావచ్చు. నగల మీద, శరీరం మీద అతి దగ్గర్నుంచి నేరుగా స్ప్రే కొట్టకూడదు. ఈ విషయం మర్చిపోకండి. ఇకపై స్ప్రే వాడినప్పుడు ఇవి పాటించండి.
బాడీ స్ర్పే వాడుతున్నారా..ఈ జాగ్రత్తలు పాటించండి
- లైఫ్
- June 3, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- LSG vs RR: లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్
- Cyber Crime : ముంబై సీబీఐ పేరుతో.. రూ.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక: ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా
- చంద్రబాబు హయాంలో బడ్జెట్ తీరు.. ఉపాధి కల్పన..
- IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
- 95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్
- చంద్రబాబు సూపర్ 6హామీలకు అయ్యే ఖర్చు.. సాధ్యాసాధ్యాలు
- భారీగా విదేశీ మద్యం పట్టివేత
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- పీజీ చేసిన వారికి గుడ్‌న్యూస్..
- మెదడు యాక్టివ్‌గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ఐపీఎల్‌కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది