స్పేర్‌‌‌‌ కీ రాక్‌‌.. ఇది అచ్చం రాయిలాగే కనిపిస్తుంది. కానీ..

స్పేర్‌‌‌‌ కీ రాక్‌‌.. ఇది అచ్చం రాయిలాగే కనిపిస్తుంది. కానీ..

ఎంత జాగ్రత్తగా దాచుకున్నా కొన్నిసార్లు తాళం చెవిని ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. అందుకే  కొందరు ఇంటి దగ్గర స్పేర్‌‌ కీని దాచుకుంటారు. అలాంటి వాళ్లకు ఈ ఫేక్‌‌ రాక్‌‌ బాగా ఉపయోగపడుతుంది. ఇది అచ్చం రాయిలాగే కనిపిస్తుంది. కానీ.. కాదు. దీని లోపల ఒక చిన్న కంపార్ట్‌‌మెంట్ ఉంటుంది.

అందులో ఇంటి, కారు కీస్‌‌ లేదా చిన్న చిన్న వస్తువులను దాచుకోవచ్చు. బయటి నుంచి చూస్తే సాధారణ గార్డెన్ స్టోన్‌‌లా ఉండడం వల్ల ఎవరికీ అనుమానం రాదు. దీన్ని అన్ని రకాల వెదర్‌‌‌‌ కండిషన్స్‌‌ను తట్టుకునే గట్టి మెటీరియల్‌‌తో తయారుచేశారు. గార్డెన్, యార్డ్, ప్లాంట్ పాట్స్ దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు సులభంగా ఓపెన్ చేసి కీ తీసుకోవచ్చు.