
హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు ఓ డాక్టర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ ముస్తఫా అనే వ్యక్తి ఫెంటనిల్ సిట్రేట్ అనే నిషేదిత డ్రగ్స్ ను అమ్ముతున్నట్లు గుర్తించారు. ముస్తఫా సమీర్ హస్పిటల్ లో అనిస్తీషియా డాక్టర్ గా పనిచేస్తున్నాడు. బ్యాన్ చేసిన ఇంజెక్షన్లను డాక్టర్ దంపతులు పోర్టర్ యాప్ ద్వారా ఇతరులకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో బాక్స్ ఇంజెక్షన్ ను రూ. 17, 500కు అమ్ముతున్నారు.
కొన్ని రోజుల క్రితం డాక్టర్ ముస్తఫా కువైట్ పారిపోయాడు. ముస్తఫా భార్య నజీవ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముస్తఫా ఇంట్లో 57 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్స్ అధికారులు. అలాగే 6లక్షల నగదును సీజ్ చేశారు. ఇంజెక్షన్ కు బానిస అయిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
.