బాహుబలి రేంజ్ లో.. రెండు ఎద్దులపై కుక్క రైడింగ్..

బాహుబలి రేంజ్ లో.. రెండు ఎద్దులపై కుక్క రైడింగ్..

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియో "ప్రతి కుక్కకి దాని రోజు వస్తుంది" అనే మాటను నిజం చేసేలా ఉంది. ఈ ఫుటేజీలో ఒక వీధి కుక్క రెండు గేదెలపై సవారీని ఆస్వాదిస్తూ కనిపిస్తోంది. మనోహరంగా కనిపించే ఈ వీడియోలో కుక్క.. గేదెలపై దర్జాగా నిలబడి ఉంది. గేదెలు కూడా కుక్కకు సపోర్టుగా నిలుస్తూ.. కుక్కను బ్యాలెన్స్డ్ గా తీసుకువెళ్లడం అందర్నీ ఆకర్షిస్తోంది.

మనుషులు కుక్కలతో ఆడుకోవడం,  పశువులకు ఆహారం ఇవ్వడం వంటి వీడియోలో ఇంటర్నెట్‌లో తరచుగా కనిపించడం చూస్తూనే ఉంటాం. కానీ ఈ క్లిప్ మాత్రం వాటికి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇందులో ఒక కుక్క రెండు గేదెలపై ఆనందంగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎలాంటి గొడవా లేకుండా ఈ ముగ్గురూ కలిసి షికారు చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.

వీడియోకు మిలియన్ల వ్యూస్

ఇన్ స్టాలో షేర్ అవుతోన్న ఈ వీడియో.. అప్ లోడ్ అయిన 48 గంటల్లోనే 16 మిలియన్ల వ్యూస్ ను  సొంతం చేసుకుంది. ఇది ట్విట్టర్ వంటి ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో కూడా తెగ షేర్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. "ఇది ఏ సినిమా షూటింగ్?" అని ఓ నెటిజన్ వీరోచిత రైడ్‌పై స్పందిస్తూ ప్రశ్నించాడు. మరొకరు కుక్కను మెచ్చుకుంటూ, " సెబాష్ !" అంటూ కామెంట్స్ సెక్షన్ నవ్వుల ఎమోజీలతో నిండిపోయింది.

 

हर कुत्ते का दिन आता है ये सुना था
आज देख भी लिया??? pic.twitter.com/9gkjq54vsn

— ?.??????? ?????????.? (@PChaudhry_) July 26, 2023