వాషింగ్టన్: భారత్‌తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ చరిత్రాత్మకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ డీల్‌తో భారత్‌తో పాటు ఇతర మిత్రదేశాలకు అమెరికా నుంచి బొగ్గు ఎగుమతులను భారీగా పెంచుతామని ఆయన తెలిపారు.
ఈ మేరకు బుధవారం నిర్వహించిన ‘ఛాంపియన్ ఆఫ్ కోల్’ అనే కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ‘‘మా నాయకత్వంలో అమెరికా భారీగా ఇంధనాన్ని ఎగుమతి చేసే దేశంగా ఎదుగుతున్నది.
గత కొద్ది నెలల్లోనే జపాన్, కొరియా, భారత్, ఇతర దేశాలతో మేం చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. దీనివల్ల మా బొగ్గు ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి” అని పేర్కొన్నారు.
