బస్సు కాదు​ రెస్టారెంట్

బస్సు కాదు​ రెస్టారెంట్

కాఫీ, టీ తాగడానికి కెఫెకి... స్పెషల్​ ఫుడ్ తినాలనిపిస్తే ఏదైనా రెస్టారెంట్​కి వెళ్తారు ఎవరైనా. కానీ కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న వైకోంలో ఈ డబుల్​ డెక్కర్​ బస్సు ఎక్కితే చాలు. నచ్చింది తినొచ్చు. ఇష్టమైన కాఫీ తాగొచ్చు.  కేరళ టూరిజం డెవలప్​మెంట్​​ కార్పొరేషన్, కేరళ ఆర్టీసీ సంస్థతో కలిసి ఈ మధ్య ‘ది ఫుడీ వీల్స్ ప్రాజెక్ట్​’ని​ వైకోంలో మొదలు పెట్టింది. టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయడంతో పాటు రోడ్డెక్కని పాత బస్సుల్ని మూలపడేయొద్దనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్​ స్టార్ట్​ చేశారు.

పాత బస్సుకి రంగులు వేసి 

పాత డబుల్​ డెక్కర్​ బస్సుకి రంగులు వేశారు. బస్సు మీద చెఫ్​, సీ ఫుడ్​ ​ బొమ్మలు వేశారు. ఇంటీరియర్​ డిజైనర్​ సాయంతో పాత బస్సుకి రెస్టారెంట్​ లుక్​ తెచ్చారు. బస్సులోపల టేబుళ్లు, కుర్చీలు వేశారు. కింది అంతస్తులో ఏసీ పెట్టించారు. రెండు అంతస్తుల్లో ఒకేసారి 50 మంది దాకా తినొచ్చు. ఇక్కడ కేరళ స్పెషల్​ వంటకాలే కాకుండా ఫారెన్​ టూరిస్టులు తినే ఫుడ్​ కూడా సర్వ్​ చేస్తారు. ఈ రెస్టారెంట్​లో ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో కలిసి నచ్చిన ఫుడ్​ తింటూ, వైకోం టౌన్​ బ్యాక్​వాటర్స్​ అందాల్ని చూడొచ్చు కూడా. ఈ ప్రాజెక్ట్ సక్సెస్​ అయితే ఇలాంటి మరిన్ని ‘ఫుడ్​ ఆన్​ వీల్​ రెస్టారెంట్లు’ తెరవాలనే ఆలోచనలో ఉన్నారు టూరిజం అధికారులు.