మానవ అక్రమరవాణా కేసులో NIA ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2026 సెప్టెంబర్ 18న తుదితీర్పు వెలవురించింది కోర్టు. ఈ కేసులో 9 మందికి జీవితఖైదు విధించింది. 8 మంది బంగ్లాదేశీయులతో సహా మొత్తం 9 మందికి జీవితఖైదు విధించింది.
ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ మహిళలకు వలవేసి అక్రమంగా భారత్‌కు తరలించారు నిందితులు. బంగ్లా మహిళలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టివేసినట్లు విచారణలో తేలింది. 2019లో పహాడీ షరీఫ్ పరిధిలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది.
ALSO READ : మాకు రూ.1000 కోట్లు ఇస్తే.. మా ఆస్తులన్నీ అప్పజెప్తాం: కేటీఆర్
మానవ అక్రమ రవాణా ముఠాపై NIA సుదీర్ఘంగా దర్యాప్తు చేస్తూ వచ్చింది. ఏళ్లపాటు సాగిన దర్యాప్తు తర్వాత.. నిందితులకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
