మెహిదీపట్నం, వెలుగు: మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన డీఆర్ సీ సెంటర్ లో ఎన్నికల సామాగ్రి తడిసి ముద్దయింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సెంటర్లోని వాన నీరు చేరింది. బుధవారం ఉదయం గుర్తించిన అధికారులు తడిసిన సామాగ్రిని కౌంటింగ్ హాలులో ఆరబెట్టారు.
