బస్సు కండిషన్‌ బాగోలేదని డ్రైవర్‌ను ముందుగానే హెచ్చరించిన ప్రయాణికుడు : 13కు చేరిన బస్సు మృతులు

బస్సు కండిషన్‌ బాగోలేదని డ్రైవర్‌ను ముందుగానే హెచ్చరించిన ప్రయాణికుడు : 13కు చేరిన బస్సు మృతులు

ఆంధ్రప్రదేశ్​రాష్ట్రం మార్కాపురం జిల్లాలో  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. 2026, మార్చి 26వ తేదీ తెల్లవారుజామున రాయవరం సమీపంలోని పలకల క్వారీల దగ్గర హైదరాబాద్ నుంచి కనిగిరి, పామూరు వెళుతున్న హరికృష్ణ  ప్రైవేట్​ట్రావెల్స్​బస్సు.. టిప్పర్‌ ను ఢీకొంది. ఈ యాక్సిడెంట్ తర్వాత ట్రావెల్స్ బస్సు మొత్తం కాలి బూడిద అయ్యింది. బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవంగానే దహనం అయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. ప్రమాదం సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా.. మంటలకు 15 మంది గాయపడ్డారు. వీరు మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 13 మంది చనిపోగా.. వీరంతా కనిగిరి, పామూరు వాసులుగా గుర్తించారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 15 మందిలో కొందరికి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. 

ALSO READ : ఇండియాకు గుడ్ న్యూస్

బస్సు కండీషన్ బాగోలేదని డ్రైవర్ ను ముందుగానే హెచ్చరించిన ఓ ప్రయాణికుడు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు యాక్సిడెంట్ పై ఓ ప్రయాణికుడు చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బాగోతం బయటపడింది. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరుట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన నలుగురు ప్రయాణికులు ఉన్నారు. బస్సు కండిషన్‌ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్‌తో చెప్పినట్లు చెబుతున్నాడు ఓ ప్రయాణికుడు. యర్రగొండపాలెం దగ్గర గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారని వెల్లడించారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కార్మికులు జగిత్యాల ప్రాంతంలో ఉన్నారు. వీరంతా జగిత్యాల, కోరుట్ల ప్రాంతంలో గృహ నిర్మాణ పనుల్లో ఉన్నారు.