పోలీస్ కస్టడీలో డ్రగ్స్​ స్మగ్లర్​ టోనీ ఆన్సర్‌‌‌‌‌‌‌‌ ఇదే

పోలీస్ కస్టడీలో డ్రగ్స్​ స్మగ్లర్​ టోనీ ఆన్సర్‌‌‌‌‌‌‌‌ ఇదే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ స్మగ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోనీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదడిగినా.. ‘ఐ డోంట్​నో’ అని ఆన్సర్​ ఇస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ డ్రగ్​కస్టమర్ల గురించి నోరు విప్పడం లేదు. వాట్సాప్, వీఓఐపీ కాల్స్‌‌‌‌‌‌‌‌తో ఆర్డర్స్ తప్ప ఏజెంట్స్, కస్టమర్లతో డైరెక్ట్ కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ లేవని చెప్తున్నట్లు తెలిసింది. పంజాగుట్ట పోలీసుల కస్టడీలో ఉన్న టోనీని ఇంటెలిజెన్స్ ఎస్పీ చైతన్యకుమార్ సోమవారం విచారించారు.  వెస్ట్‌‌‌‌‌‌‌‌జోన్‌‌‌‌‌‌‌‌ డీసీపీ జోయల్ డేవిస్‌‌‌‌‌‌‌‌, టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌‌‌‌‌‌‌‌ రావుతో కలిసి ఆయన టోనీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌  గురించి ఆరా తీశారు.

బ్యాంకు లావాదేవీలపై
టోనీ బ్యాంక్ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ వెరిఫై చేశారు. అతని కాల్‌‌‌‌‌‌‌‌డేటా ఆధారంగా ఏజెంట్లు, కస్టమర్ల నంబర్స్ కలెక్ట్ చేశారు. టోనీ ఏజెంట్స్‌‌‌‌‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌, నూర్ మహ్మద్‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌ నుంచి టోనీకి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్​ అయిన మనీ గురించి ఆరా తీశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఏడుగురు కస్టమర్ల ట్రాన్సాక్షన్స్ హిస్టరీనీ పరిశీలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు వ్యాపారస్తుల్లో బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌ బిజినెస్​మెన్​ శశ్వత్‌‌‌‌‌‌‌‌జైన్‌‌‌‌‌‌‌‌కు టోనీతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. శశ్వత్‌‌‌‌‌‌‌‌జైన్‌‌‌‌‌‌‌‌ ద్వారా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని పలువురు వ్యాపారులకు డ్రగ్స్ సప్లయ్ జరిగినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. పోలీసులు డ్రగ్స్​ కేసులో ఏ20గా పేరు నమోదు చేసిన ముంబైకి చెందిన గజేంద్ర పారక్​ను అక్కడి పోలీసులు అరెస్ట్ ​చేశారు. దీంతో పీటీ వారెంట్​పై అతడిని తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.