Good Health : చల్లటి నీళ్లు తాగుతున్నారా.. కొవ్వు పేరుకుపోతుంది.. చాలా డేంజర్..!

Good Health : చల్లటి నీళ్లు తాగుతున్నారా.. కొవ్వు పేరుకుపోతుంది.. చాలా డేంజర్..!

ఎండాకాలంలో ఏది తిన్నా... ఏం తాగినా... అది చల్లగానే ఉండాలనుకుంటారు. ఉక్కపోత, వేడితో దాహార్తి తీర్చుకోవడం కోసం చల్లటి నీళ్లనే ఎంచుకుంటారు చాలామంది. కానీ ఆ నీళ్లు ఆరోగ్యానికి అసలు మంచివి కాదంటున్నారు నిపుణులు. చల్లటి నీళ్లతో లాభాల సంగతి ఎలా ఉన్నా... దుష్ప్రభావాలే ఎక్కువ. ముఖ్యంగా భోజనం చేశాక చల్లటి నీళ్లు తాగితే ఆహారంగా తీసుకున్న కొవ్వులు కరగకుండా పేరుకుపోతాయి.

వీటిని కరిగించడం శరీరానికి కష్టం అవుతుంది. కాబట్టి ఆహారం తీసుకున్న వెంటనే చల్లటి నీళ్లు తాగకపోవడం మంచిది. ఎక్సర్సైజ్లు చేసే సమయంలోనూ చల్లటి నీళ్లు తాగొద్దు. కసరత్తులు చేసిన తర్వాత వెచ్చని నీళ్లు తాగాలని జిమ్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. వర్కౌట్ చేసినప్పుడు శరీరంలో చాలా వేడి ఉత్పత్తి అవుతుంది. 

కాబట్టి వెంటనే చల్లటి నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రతల్లో అసమతుల్యత తలెత్తి జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. చల్లని నీళ్లు, కూల్ డ్రింక్స్ లాంటి శీతల పానీయాలు తాగితే, వాటి దుష్ప్రభావాలు రక్త నాళాలపై ప్రభావం చూపుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే, మండు వేసవిలోనైనా సరే, దాహం వేసినప్పుడు, అలసినప్పుడు చల్లటి నీళ్లు తాగొద్దు.