
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియాలో టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) ఒకరు. ఈ డైరెక్టర్ హిందీలో ఊహకందని కాన్సెప్ట్స్ తో అనేక పీరియాడికల్ డ్రామాలను తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. అంతేకాదు సంజయ్ తీసిన సినిమాలు అత్యధిక వసూళ్లు కూడా రాబట్టాయి.
ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘హిరామండి: ది డైమండ్ బజార్’. అయితే ఈ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, రిచా చద్దా, షర్మిన్ సెగల్, ఫర్దీన్ ఖాన్, శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్ మరియు ఇతరులు నటించారు. ఇది మే 1 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.
ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పాకిస్తాన్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. పాక్‌లోని రెడ్-లైట్ ఏరియాలో నివసించే మహిళల పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అయితే సంజయ్ లీలా భన్సాలీ ఇటీవల లాస్ ఏంజెల్స్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిరామండి వెబ్ సిరీస్ ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంజయ్ ప్రముఖ యూట్యూబర్ మరియు హోస్ట్ లిల్లీ సింగ్‌తో ఇంటరాక్ట్ అవుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'ఈ మల్టీస్టారర్ షోలో పాకిస్థానీ నటులు మహిరా ఖాన్ మరియు ఫవాద్ ఖాన్ కీలక పాత్రలు పోషించాలని భావించినట్లు దర్శకుడు వెల్లడించారు. వీరితో హీరమండి సినిమా చేయాలని అనుకున్నానని, దీన్ని తీయాలనే ఆలోచన గత 18 ఏళ్లుగా తన మనసులో ఉందని కూడా చెప్పాడు. అలాగే, ప్రస్తుతం నటిస్తున్న నటీనటులు తన మొదటి ఎంపిక కాదని బన్సాలీ అన్నారు.త్వరలో తాను అనుకున్న పాకిస్థానీ నటితో సినిమా షురూ అయితే మాత్రం ఇండస్ట్రీ ఇక దబిడి దిబిడే.
హిందీలో అద్భుతమైన చిత్రాలను అందించిన ఆయన..సినీ పరిశ్రమలోని ప్రతి స్టార్ తో కలిసి పనిచేయాలనుకున్నాడట. ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్, షారుఖ్ ఖాన్, అలియా భట్ వంటి స్టార్స్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సంజయ్..ఈ షోలో మరో ఆసక్తికర విషయాన్ని కూడా షేర్ చేసుకున్నారు.
"నా మనస్సులో బహుళ కాస్టింగ్‌లు ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ రేఖా, కరీనా కపూర్ ఖాన్ మరియు రాణి ముఖర్జీ వీరితో ఓ ప్రాజెక్ట్ చేయాలని ఆలోచించాను. ఆ తర్వాత పాకిస్తానీ నటి మహీరా ఖాన్(Mahira Khan) మరియు ఇమ్రాన్ అబ్బాస్, ఫవాద్ ఖాన్ కూడా ఒక సమయంలో నా మనస్సులో ఉన్నారని సంజయ్ లీలా భన్సాలీ వెల్లడించారు. త్వరలో ఈ క్రేజీ కాంబోలో అదిరిపోయే సినిమా రానుందని సమాచారం. దీంతో బాలీవుడ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.