గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కాగిత రహిత పని సంస్కృతికి అధికారులు నాంది పలికారు. ఫైల్ ట్రాకింగ్‌ను క్రమబద్ధీకరించడం, జవాబుదారీతనం పెంచడం, నిర్ణయం తీసుకోవడంలో జాప్యాలను తగ్గించడం, విభాగాల అంతటా సురక్షితమైన డిజిటల్ సహకారం కోసం సీపీ డాక్టర్ ఎం. రమేశ్, డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, డీసీపీ సైబర్ క్రైమ్స్ వై.వి.ఎస్. సుధీంద్రతో కలిసి సోమవారం ఈ-–ఆఫీస్ వ్యవస్థను ప్రారంభించారు.
