ఢిల్లీలో స్వల్ప భూకంపం

ఢిల్లీలో స్వల్ప భూకంపం

ఢిల్లీలో ఆదివారం స్వ‌ల్ప‌ భూకంపం సంభ‌వించింది. భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం సాయంత్రం 5-45 గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీ-ఎన్‌ఆర్సీ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు.

రిక్టర్‌ స్కేలుపై భూ ప్రకంపనలు 3.5గా నమోదు అయ్యాయి. 8 కిలోమీట‌ర్ల మేర కొన్ని సెక‌న్ల‌పాటు భూకంపం రావ‌డంతో జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స‌మాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.