మీకు తెలుసా : ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఎందుకు అంటారో..!

మీకు తెలుసా : ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఎందుకు అంటారో..!

మీరు ఎవరినైనా కలిసినప్పుడు ఆ వ్యక్తికి మీమీద సదభిప్రాయం కలగాలన్నా, మిమ్మల్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలనుకున్నా ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది.. మీరు మొదట ఆ వ్యక్తిని కలిసినప్పుడు, చివరగా వెళ్లేటప్పుడు ఇంప్రెస్ చేయటం. మాటలతో కావొచ్చు.. చేతలతో కావొచ్చు.. ఎదుటివాళ్లను ఆకట్టుకోవాలి.ఎందుకంటే ఎవరైనా ఇతరుల గురించి ఆలోచించాలంటే వాళ్లు కలవగానే ముందు ఏం చేశారు... చివరకు వెళ్లేటప్పుడు ఏం చేశారు. 

అన్నదాన్నిబట్టే ఒక వ్యక్తి మీద అభిప్రాయానికొస్తారని, వాటినే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారని ఒక అధ్యయనంలో తేలింది. 'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్' అంటారుగా, అందుకే మొదట ఇంప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఎలా గడిచినా ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్లేటప్పుడు నవ్వుతూ థాంక్స్ చెప్పి, వాళ్లనూ నవ్వించి వెళ్లాలి. అంతే మళ్లీ మీరు కలవగానే అదే నవ్వుతో పలకరిస్తారు. 

ఇది వ్యక్తిగత సంబంధాల విషయంలోనే కాదు... వృత్తి, వ్యాపారం.. ఇలా అనేక రంగాల్లో పయోగపడుతుంది. ఏదైనా ఇంటర్వ్యూకు వెళ్లారనుకోండి. అక్కడ అడుగుపెట్టగానే మీ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, మాటతీరును అబ్జర్వ్ చేస్తారు. ఇవన్నీ బాగుంటే వాళ్లకు మీ మీద సదభిప్రాయం కలుగుతుంది. ఇక ఇంటర్వ్యూ ముగించి వెళ్లేటప్పుడు నవ్వుతూ, కాన్ఫిడెంట్ గా వెళ్తే మీరు మరోసారి ఇంప్రెస్ చేసిన వాళ్లవుతారు. అందుకే ముందుగా, చివరగా ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడామన్నది చాలా ముఖ్యం.