కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ గురువారం ( జులై 3 ) సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు యశోద ఆసుపత్రి వైద్యులు. కేసీఆర్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారని...ఆయనకు పలు టెస్టులు చేశామని.. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలినట్లు వెల్లడించారు డాక్టర్లు. దీంతో పాటు సోడియం  లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఇవి మినహా మిగతా టెస్టులు అన్ని నార్మల్ గా వచ్చాయని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు డాక్టర్లు.

ఇదిలా ఉండగా.. సీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు సీఎం రేవంత్. యశోద ఆసుపత్రి వైద్యులు, అధికారులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు సీఎం రేవంత్. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సీజనల్ ఫీవర్తో బాధపడుతున్న కేసీఆర్ చికిత్స నిమిత్తం గురువారం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కు వెళ్లారు. ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. కేసీఆర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేనప్పటికీ మూడు రోజుల పాటు నందినగర్లోని నివాసంలోనే ఆయన ఉండనున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారు. వాతావరణం మారడం, వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ గురువారం సాయంత్రం ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు.