విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌‌‌‌లో స్కాట్లాండ్‌‌‌‌తో ఇండియా డ్రా

విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌‌‌‌లో స్కాట్లాండ్‌‌‌‌తో ఇండియా డ్రా

హైదరాబాద్, వెలుగు: విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌‌‌‌లో టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. సోమవారం గచ్చిబౌలి హాకీ స్టేడియంలో స్కాట్లాండ్‌‌‌‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌‌‌‌ను 2–-2తో డ్రాగా ముగించింది. ఈ ఫలితంతో ఇరు జట్లూ చెరో నాలుగు పాయింట్లతో ఉన్నప్పటికీ, మెరుగైన గోల్ డిఫరెన్స్ కారణంగా ఇండియా పూల్–-బి పట్టికలో టాప్ ప్లేస్‌‌‌‌ నిలబెట్టుకుంది. 

ఆట ప్రారంభమైన 6వ నిమిషంలోనే స్కాట్లాండ్ ప్లేయర్ హెదర్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్  కొట్టగా.. 18వ నిమిషంలో నవనీత్, 29వ నిమిషంలో సునేలితా గోల్స్‌‌‌‌తో ఇండియా 2-–1తో ఆధిక్యాన్ని అందించింది. కానీ, నాలుగు నిమిషాల తర్వాత స్కాటిష్ ప్లేయర్ బర్నెట్ గోల్ చేయడంతో స్కోరు సమమైంది. చివరి క్వార్టర్‌‌‌‌లో ఇండియా ఏకంగా తొమ్మిది పెనాల్టీ కార్నర్లు దక్కించుకున్నా మరో గోల్ చేయలేకపోయింది. బుధవారం జరిగే తర్వాతి మ్యాచ్‌‌‌‌లో వేల్స్‌‌‌‌తో తలపడనుంది.