హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమెన్స్ రగ్బీ లీగ్ రెండో సీజన్‌లో బ్లాక్ ఆర్చర్స్ రగ్బీ క్లబ్ చాంపియన్‌గా నిలిచింది. జింఖానా ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్లో బ్లాక్ ఆర్చర్స్ టీమ్ 10–7 స్కోరుతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. బ్లాక్ ఆర్చర్స్ ప్లేయర్ శిరీష 7 ట్రైలు చేసి టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక మూడో స్థానం కోసం జరిగిన పోరులో మేడ్చల్ టీమ్ 22–-0తో జనగామను చిత్తుచేసింది. రగ్బీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ నరేంద్ర రామ్ విన్నర్లకు ట్రోఫీ అందించారు.
