టెక్నికల్ కోర్సులతో త్వరగా ఉద్యోగాలు : ఎమ్మెల్యే ముఠా గోపాల్

టెక్నికల్ కోర్సులతో త్వరగా ఉద్యోగాలు : ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, వెలుగు: టెక్నికల్ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన రెండు వారాల ట్రైనింగ్ కోర్సులను రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.రాజాతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు.

తక్కువ సమయంలో సెటిల్ అవ్వాలనుకునే విద్యార్థులు షార్ట్ టర్మ్ కోర్సుల వైపు మొగ్గు చూపాలని, దీనివల్ల వెంటనే ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రిన్సిపాల్ బి.రాధాకృష్ణమూర్తి, ట్రైనింగ్ ఆఫీసర్ జి.విశ్వ పాలక్ రెడ్డి పాల్గొన్నారు.