- రివెట్మెంట్ వాల్ నిర్మాణం
- వేల మంది కూర్చోవడానికి ఏర్పాట్లు
- 5,424 చ. మీ మేర గోడలకు పెయింటింగ్స్
- రూ.3.16 కోట్లతో హెచ్ఎండీఏ ప్రతిపాదనలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: హుస్సేన్సాగర్తీరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ‘సాగర్’కు ఆనుకుని ఏర్పాటు చేసిన పీపుల్స్‌ప్లాజా, నెక్లెస్‌రోడ్, లుంబినీ పార్క్స్పెషల్అట్రాక్షన్గా నిలవగా, త్వరలో ట్యాంక్‌బండ్‌కు ఉత్తరాన సంజీవయ్య పార్క్పరిసరాలకు కొత్త హంగులు తీసుకురాబోతున్నారు. బుద్దభవన్నుంచి సంజీవయ్య పార్క్వరకూ ఛత్‌పూజ చేసుకునే ప్రాంతాలను, బతుకమ్మ ఘాట్లను విస్తరించి ఆధునీకరించాలని, పీపుల్స్‌ప్లాజా, నెక్లెస్‌రోడ్, లుంబినీ పార్క్‌వైపు ఎలా ఉందో అట్లనే తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ అధికారులు నడుం బిగించారు.
ఘాట్ల సుందరీకరణ
నగరంలో స్థిరపడిన బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన మహిళలు ప్రతి యేడు కార్తీక మాసం, దీపావళి సందర్బంగా ఛత్ పూజను జరుపుకుంటారు. హుస్సేన్సాగర్తీరానికి వందల సంఖ్యలో చేరుకుని సూర్య భగవానుడికి, ఆయన సోదరి ఛతీ మైయాకు నైవేద్యాలు సమర్పిస్తారు. వీరితో పాటు బతుకమ్మ సందర్భంగా నిమజ్జనాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.
వీరి కోసం మూడేండ్ల కింద బీఆర్ఎస్ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌కు ఉత్తరాన బుద్ధభవన్ఎదురుగా ఉన్న తీరం వద్ద ఘాట్లను నిర్మించింది. అయితే, నిర్వహణ సరిగ్గా లేకపోవడం, కేవలం పండుగల సందర్భాల్లోనే రంగులు వేసి రిపేర్లు చేస్తుండడంతో ప్రయోజనం లేకుండా పోతంది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఈ ఘాట్లను విస్తరించడంతో పాటు, పరిసరాలను అందంగా ముస్తాబు చేయనున్నట్టు ప్రకటించారు. వేల సంఖ్యలో వచ్చే మహిళలు కూర్చోడానికి కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు.
రూ. 3.16 కోట్లతో పనులు
బుద్ధ భవన్ వైపు నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఘాట్ల పునర్ నిర్మాణంతో బాటు రివెట్ మెంట్ వాల్ నిర్మాణానికి రూ. 3.16 కోట్లు వెచ్చించనున్నారు. 5,424 చదరపు మీటర్ల మేర గోడలకు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా అందమైన పెయింటింగ్స్ వేయనున్నారు.
ఘాట్ల పొడవునా పచ్చని చెట్లతో పాటు గార్డెనింగ్ఏర్పాట్లు చేయనున్నారు. నెక్లెస్‌రోడ్ వైపున ఏ విధంగా ఉంటుందో..ఇటు సంజీవయ్యపార్క్సమీపంలోనూ అలాంటి ఏర్పాట్లే చేయాలని నిర్ణయించారు. వచ్చే దసరా, దీపావళి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు...
