న్యూఢిల్లీ: అద్భుత ఆటతో టీ20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకున్న టీమిండియా ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నీలో హవా చూపెట్టింది. టోర్నీలో బెస్ట్ పెర్ఫామెన్స్ చేసిన ప్లేయర్లతో ఐసీసీ సోమవారం ఎంపిక చేసిన జట్టులో ఇండియా నుంచి అత్యధికంగా నలుగురు (సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా) ఎంపికయ్యారు.
శాంసన్ 5 ఇన్నింగ్స్‌ల్లోనే 321 రన్స్ సాధించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. ఇషాన్ 193.29 స్ట్రైక్ రేట్‌తో 317 రన్స్ చేయగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 9 వికెట్లతో పాటు రెండు ఫిఫ్టీలు కూడా కొట్టాడు. బుమ్రా ఫైనల్లో 4 వికెట్లు సహా మొత్తంగా14 వికెట్లు పడగొట్టాడు. సెమీఫైనల్లో ఓడిన సౌతాఫ్రికా సారథి మార్‌క్రమ్ ఈ టీమ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టీమ్
సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్), శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, మార్‌క్రమ్ (కెప్టెన్ - సౌతాఫ్రికా), హార్దిక్ పాండ్యా , విల్ జాక్స్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), బుమ్రా , ఎంగిడి (సౌతాఫ్రికా), అదిల్ రషీద్ (ఇంగ్లండ్), ముజరబానీ (జింబాబ్వే). 12వ ప్లేయర్: షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (యూఎస్‌ఏ).
