బెస్ట్ శాలరీస్లో ఐటీ ఫీల్డే తోపు.. శాలరీ గ్రోత్లో హైదరాబాద్ టాప్.. ఐటీ ఫ్రెషర్కు ఎంతొస్తుందంటే..

బెస్ట్ శాలరీస్లో ఐటీ ఫీల్డే తోపు.. శాలరీ గ్రోత్లో హైదరాబాద్ టాప్.. ఐటీ ఫ్రెషర్కు ఎంతొస్తుందంటే..

ఇండియాలో ఏ రంగంలో ఉద్యోగులు జీతాలు ఎక్కువ తీసుకుంటున్నారనే విషయంలో నిస్సందేహంగా ఐటీ సెక్టార్ అని చెప్పేయొచ్చు. ఐటీ, ఐటీ ఆధారిత రంగాలే ఎక్కువ జీతాలు చెల్లించే విషయంలో మరోమారు టాప్లో నిలిచాయని ఇండీడ్ పేమ్యాప్ సర్వేలో (Indeed PayMap Survey) వెల్లడైంది. అంతేకాదు.. ఈ సర్వే నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ రంగంలో ఫ్రెషర్స్ నెలకు 28 వేల 600 వరకూ సంపాదిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఐదు నుంచి ఏడేళ్ల అనుభవం ఉన్న ఐటీ ఉద్యోగులకు ఇండియాలో యావరేజ్గా నెలకు 68 వేల 900 జీతం అందుకుంటున్నారని ఈ సర్వే పేర్కొంది.

ఇక శాలరీ గ్రోత్ విషయంలో.. దేశంలోనే మహా నగరాలుగా చెప్పుకునే ఢిల్లీ, ముంబై, కోల్కత్తా కంటే హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ ముందున్నాయి. మెట్రో సిటీలైన ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్లోనే బెటర్ శాలరీ గ్రోత్ ఉందని ఇండీడ్ పేమ్యాప్ సర్వే వెల్లడించింది. క్రమం తప్పకుండా జీతాలు పెంచే విషయంలో కూడా హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లోని కంపెనీలే ఇండియాలో టాప్లో ఉన్నాయని సదరు సర్వే పేర్కొంది. అంతేకాదు.. దేశంలోని మెట్రో నగరాల్లో కంపెనీలు ఉద్యోగులకు చెల్లించే జీతాలకు, అక్కడ లివింగ్ కాస్ట్కు ఏమాత్రం మ్యాచ్ అవడం లేదని సర్వే తెలిపింది.

మెట్రో నగరాల్లోని 69 శాతం ఉద్యోగులు చాలీచాలని జీతాలతో ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఈ సర్వే వెల్లడించింది. చెన్నై నగరంలో ఐటీ ఫ్రెషర్స్ ఎంట్రీ లెవెల్ రోల్స్లో అత్యధికంగా 30 వేలు మంత్లీ శాలరీ తీసుకుంటున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. ఐటీ సెక్టార్లో ప్రొడక్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బెస్ట్ శాలరీస్ అందుకుంటున్నారు. కొందరు ప్రొఫెషనల్స్ 85 వేల 500 వరకూ పొందుతున్నారు. 

UI/UX Designers కూడా నెలకు 65 వేల జీతం అందుకుంటున్నారని సర్వేలో తెలిసింది. హైదరాబాద్లో ఫ్రెషర్స్కు.. రెండేళ్ల అనుభవం ఉన్న వారికి యావరేజ్గా 28 వేల 500 జీతం ఉందని, 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులు 47 వేల 200 దాకా శాలరీ తీసుకుంటున్నారని.. 5 నుంచి 8 ఏళ్లు అనుభవం ఉన్న ఉద్యోగులు 69 వేల 700 వరకూ మంత్లీ శాలరీ పొందుతున్నారని ఈ సర్వే పేర్కొనడం విశేషం.