
ఒక తండ్రి ధైర్యం తన 10 ఏళ్ల కూతురిని రెండు విషపూరిత పాముల నుండి కాపాడింది. ఇది మీకు సినిమాలోని సన్నివేశంల అనిపించిన, కానీ నిజం. అసలు విషయం ఏంటంటే సలోని కుమారి నిద్రలో ఉండగా రెండు విషపూరిత పాములు తన మెడకి చుట్టుకున్నాయి. ఉదయం ఆమె తల్లి తన కూతురిని నిద్రలేపడానికి వెళ్లి చూడగా ఆమె మెడ చుట్టూ ఉన్న పాములను చూసి అవాక్కయింది.
దింతో ఆమె గట్టిగా కేకలు పెట్టింది. తన భార్య అరుపులు విన్న సలోని తండ్రి రాజు కుమార్ వెంటనే గదిలోకి పరుగెత్తాడు. దింతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన చేతులతో పాముల మెడ పట్టుకొని చంపాడు.
ఈ సంఘటన ఆ గ్రామంలో రాజు ధైర్యానికి ప్రశంసలు కురిపించింది. తన కూతురిని ప్రమాదం నుండి కాపాడినందుకు అతన్ని "నిజమైన హీరో"గా ప్రశంసించారు. ఈ ఘటన తర్వాత సలోనిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లగా, అక్కడ ఆమెకు ఎటువంటి హాని జరగలేదని తెలిపారు. మరిన్ని పరీక్షల కోసం మగధ్ మెడికల్ కాలేజీకి పంపగా అక్కడ కూడా సలోని ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
సలోని తండ్రి రాజు కుమార్ కేసరి మాట్లాడుతూ, "ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. రాత్రి భోజనం తర్వాత అందరూ నిద్రపోయాం. సలోని తల్లి ఉదయం నిద్ర లేచి చూడగా, కూతురి మెడలో రెండు పాములు చుట్టుకొని ఉన్నాయి. దింతో ఆమె కేకలు వేయడం ప్రారంభించింది. ఆమె అరుపులు విన్న వెంటనే నేను గదిలోకి పరిగెత్తాను. సలోని గాఢ నిద్రలో ఉంది, అప్పటికి రెండు పాములు ఆమె మెడ చుట్టూ ఉన్నాయి" అని చెప్పగా..
"నేను వెంటనే నా భార్యతో పాములను పట్టుకునేటప్పుడు అమ్మాయిని పట్టుకోమని చెప్పాను. తరువాత ఆమె కూతురి కాళ్ళను గట్టిగా పట్టుకుంది. అప్పుడు రెండు పాములను మీద వద్ద పట్టుకుని, కూతురి మెడ చుట్టూ చుట్టి ఉండగానే చంపేసినట్లు తెలిపాడు.