
ఈ మధ్య ఆడాళ్ళు మరీ వైలెంట్ గా తయారవుతున్నారు.. సీరియళ్ల ప్రభావమో, సినిమాల ప్రభావమో కానీ.. పక్కా స్కెచ్ వేసి భర్తలను చంపేస్తున్నారు. హనీమూన్ కి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి భర్తను చంపి.. మిస్సింగ్ కేసుగా సీన్ క్రియేట్ చేసింది ఓ భార్య. ఇది మరువక ముందే.. పెళ్లైన నెల రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చుతుంది మరో భార్య. ఇలా వరుస ఘటనలతో పెళ్లి మాట తలచుకుంటేనే వణుకు పుట్టేలా చేస్తున్నారు మహిళామణులు. బీహార్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే.. మానవ సంబంధాలు ఇంత దిగజారుతున్నాయా అన్న అనుమానం రాక మానదు. మామపై మనసు పడ్డ భార్య మామతో కలిసి భర్తను చంపించింది. బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మేఘాలయ హనీమూన్ మర్డర్ ని మించిన ట్విస్టులు ఉన్న ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... కొత్తగా పెళ్లైన గుంజా దేవి తన భర్త తండ్రి జీవన్ సింగ్ తో కలిసి షూటర్లను పురమాయించి.. తన భర్త ప్రియాంషును చంపించిన ఈ ఘటనలో నిందితురాలు దేవి, ఇద్దరు షూటర్లను అరెస్టు చేశారు పోలీసులు, పరారీలో ఉన్న మామ జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ALSO READ | బెంగళూరు కేఫ్‌లో ఘోరం: ఎక్స్ట్రా కాఫీ కప్పు ఇవ్వలేదని సిబ్బందిపై దాడి..
దేవి, జీవన్ సింగ్ లు ప్రేమించుకున్నారని.. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితం దేవి కుటుంబసభ్యులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేసినట్లు తెలిపారు పోలీసులు. జూన్ 25న, ప్రియాంషు తన సోదరిని కలిసి రైలులో ఇంటికి తిరిగి వస్తుండగా... నవీ నగర్ స్టేషన్‌కు చేరుకున్నాక తనను తీసుకెళ్లడానికి బైక్‌పై ఎవరినైనా పంపమని దేవికి చెప్పాడు ప్రియాంషు.
స్టేషన్ నుండి తన ఇంటికి వెళ్తుండగా, ఇద్దరు వ్యక్తులు అతనిని కాల్చి చంపినట్లు తెలిపారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రియాంషు కుటుంబసభ్యుల ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
దేవి కాల్ రికార్డులను పరిశీలించగా, ఆమె తన మామతో ఎక్కువగా టచ్‌లో ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. మామ కాల్ రికార్డుల పరిశీలించిన పోలీసులు అతను అతను షూటర్లతో టచ్‌లో ఉన్నట్లు తేలిందని తెలిపారు.