గుడ్ న్యూస్: హైదరాబాద్ లో మరో నాలుగు స్కైవాక్లు.. ఏ ఏరియాల్లో అంటే..

గుడ్ న్యూస్: హైదరాబాద్ లో మరో నాలుగు స్కైవాక్లు.. ఏ ఏరియాల్లో అంటే..

హైదరాబాద్ లో మరో నాలుగు స్కై వాక్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు హెచ్ఎండీఏ కమీషనర్ అహ్మద్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మెట్రోరైలు ఈస్ట్, వెస్ట్ స్టేషన్లతోపాటు రేతిఫైల్, కీస్ హైస్కూల్ బస్టాప్ లను కలిపే విధంగా స్కైవాక్ రూపొందించామని తెలిపారు. కొత్తగా.. కూకట్ పల్లి జేఎన్టీయూ నుంచి మెట్రోస్టేషన్ వరకు, జేఎన్టీయూ నుంచి ప్రగతి నగర్ మార్గంలో వెళ్లేందుకు స్కైవాక్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఉప్పల్ వెళ్లే మార్గంలో శ్మశాకవాటిక ఉండడంతో స్కైవాక్ ఏర్పాటు చేయకలేకపోయామని..  దీంతో ప్రమాదాలు జరుగుతుండడంతో అక్కడ కూడా స్కైవాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ALSOS READ | ఆ గేటు తాళం పగలగొట్టండి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు.. బాలానగర్లో ఏమైందంటే..

మెహిదీపట్నం స్కైవాక్ ను ఆగస్టు 15న ప్రారంభిస్తామని.. ఆదాయ వనరులు పెంచుకోవడానికి కొత్తగా కంది, ఫసల్ వాడీ, పెద్ద కంజర్లలో హెచ్ఎండీఏ లేఅవుట్లను అభివ్రుద్ధి చేయాలని నిర్ణయించామని అన్నారు కమీషనర్ అహ్మద్. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను సేకరించి పెద్ద పెద్ద లేఅవుట్లు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు అహ్మద్. 

హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 పనులు 2026 మే వరకు పూర్తి చేస్తామని.. మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ఎకానమిక్ డెవలప్మెంట్ ప్లాన్, బ్లూ, గ్రీన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్లాన్ పనులు జరుగుతున్నాయని అన్నారు.హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్లు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని... జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. HMDA పరిధిలో 19 కొత్త పార్కులను ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించామని తెలిపారు కమీషనర్ అహ్మద్.