ఆ గేటు తాళం పగలగొట్టండి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు.. బాలానగర్లో ఏమైందంటే..

ఆ గేటు తాళం పగలగొట్టండి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు.. బాలానగర్లో ఏమైందంటే..

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందంతో కలిసి  గురువారం బాలానగర్లో పర్యటించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి వినాయకనగర్ కాలనీలోని గడ్డి చేను స్థలాన్ని అనుకుని ఉన్న నాలాను పరిశీలించారు. నాలాను పరిశీలించడానికి వెళ్లే దారికి గేట్లు వేసి తాళాలు వేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గేటుకు వేసిన  తాళాన్ని పగలగొట్టండని రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి హుటాహుటిన రావడంతో గేటుకు తాళం వేయడం సరికాదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. తాళాలు తీసి లోపలికి వెళ్ళి నాలా ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం వినాయక నగర్, కళ్యాణ్ నగర్ వద్ద ఉన్న నాలాలను అధికారులతో కలిసి పరిశీలించారు.

ALSO READ | ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు అనుమానంతోనే పిటిషన్లు: హైకోర్టులో TGPSC వాదన

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. నాలా ఉన్న ప్రాంతం ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో.. మొదట అక్కడ ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామని అన్నారు. నాలా లోపల స్టీల్ట్ను కూడా తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. వారం రోజుల్లో స్థానిక కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేస్తామనున్నారు. డ్రోన్ కెమెరాతో నాలా మొత్తం పొడవునా వీడియో తీసి చిత్రీకరిస్తామని అన్నారు. నాలా ఆక్రమణలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేనిది స్పష్టం చేశారు.