ఆధ్యాత్మికం.. ఇలా చేయండి.. ఆనందం.. ఐశ్వర్యం మీ సొంతం..!

ఆధ్యాత్మికం.. ఇలా చేయండి.. ఆనందం.. ఐశ్వర్యం మీ సొంతం..!

చాలామంది నోటి నుంచి.. అరె  ఎలా ఉన్నావు.. జీవితం ఎలా ఉంది.. అంతా బాగానే..! అని  పాత మిత్రులను బంధువులను అడిగినప్పుడు.. కొంతమంది ఫైన్​.. అని.. మరి కొంత మంది పర్వాలేదని.. ఇంకొంతమంది ఆ.. ఏ జీవితమో.. ఏమోరా..! దమ్మిడీ ఆదాయం లేదు.. క్షణం తీరిక లేదంటూ నిట్టూర్పులిడుస్తుంటారు.  ఇదంతా మానవ సహజం. కాని ఈ విషయాన్ని సూక్ష్మంగాఆలోచించాలి.  హిందూ పురాణాల ప్రకారం అలాంటి వారు ఏం చేస్తే.. ఐశ్వర్యం.. ఆనందం కలుగుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !

హిందూ పురాణాల ప్రకారం...  అలా ఉన్నవారు కొన్ని పనులు చేస్తే  అలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం..  కొంతమందికి ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ ఉండదు.  అయినా ఫ్రీగా ఉంటారా అంటే.. ఉండరు.. ఎప్పుడు.. ఏదో ఒక బిజీ..అలాంటి వారి నివసించే ఇళ్లు వాస్తు ప్రకారం అన్ని అనుకూలంగా గత జన్మల కర్మ వలన ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది.  వీరు కొన్ని పనులను  చేయడం వలన ఆ కర్మ నుంచి విముక్తి కలిగే అవకాశం ఉందని పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు.

  • ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి జీవ నదుల  నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదు ఇబ్బందులు ఉండవని పురాణాల్లో ఉంది.  ఇలా చేయడం వలన త్వరలోనే ఆర్థిక స‌మ‌స్యలు తీరిపోతాయి.
  • ఎవరైతే తెల్లని అన్నానికి.. తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో అలాంటి వారికి గత జన్మల కర్మ ఫలంతో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.  అంతేకాదు చర్మ వ్యాధులతో బాధపడే వారు  41 ఆదివారాలు ఇలా చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోతాయి. 
  • ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.
  • తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.ఆర్థికంగా స్థిర పడతారు.
  •  తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు 
  • ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.
  •  అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదంగా ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వస్తుంది.
  •  నరదృష్టి ఉన్నవారికి ఏ పని చేసినా కలసి రాదు.  ఆర్థికంగా ఉండే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.  అలాంటి వారు .. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి దిష్టి అయినా తొలగిపోతుంది.

పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ, వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చినపుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఓసద్బ్రాహ్మణునకు చేసినదానఫలం, పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమ జన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ‘ధర్మం’ చేయడానికి పరిధులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, ‘దానం’ చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చేయడానికి వీలులేదు. శాస్త్రనియమానుసారం దాన యోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటిని మాత్రమే దానం చేయాలి. 

కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతుంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తనదంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రం, సమస్త సస్యసమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై, దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.