
కోవిడ్ వచ్చేంత వరకు చాలామందికి జీవితం విలువ ఏంటో అర్థం కాలేదు. భౌతిక అభివృద్ధిని సూచించే జీడీపీ, జీఎస్ పీ లాంటివన్నీ జీవితం తాలూకు ప్రేమ ముందు చిన్నబోయాయి. ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలన్ని తమ ఎకనామిక్ ప్లాన్స్ అన్నింటినీ హాల్డ్లో పెట్టి... మనుషుల ప్రాణాలు కాపాడేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టాయి. జీవితం... జీవితాన్నే ప్రేమిస్తుంది. ఈ యూనివర్సల్ లా... 'ఏకో ఫిలాసఫీ' నుంచి పుట్టింది.
ఎపుడైతే జీవితం... జీవితాన్ని ప్రేమిస్తుందో అప్పుడు మనం ప్రతిచోట జీవితాన్ని చూస్తాం. కేవలం మనిషి జీవితమే కాదు. ఈ జీవావరణంలో ఉన్న ప్రతి జీవి జీవితాన్ని చూస్తాం. భూమికి అవతల, గ్రహాల్లోనూ జీవితాన్ని చూస్తాం. ఏ జీవి కూడా ఇతర జీవులు మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా బ్రతకలేదు. ప్రతి జీవి ఇతర జీవుల మీద ఆధారపడి బతుకుతుంది.ఇదే జీవవైవిధ్యం, అభివృద్ధి కంటే ఇదే ముఖ్యమైనది. ఎందుకంటే 'మోనో కల్చర్' నుంచి ఈ సృష్టి ఉద్భవించలేదు. మనం దేనిమీద ఆధారపడి బతుకుతున్నామో ఒకసారి లోతుగా పరిశీలించుకుంటే.. భూమ్మీద అన్ని జీవాలూ బతుకుతాయి.
అన్వేషణ
భూమి లాంటి ఇంకేదైనా ఉందా?. ఉంటే అక్కడ మనలాగే మనుషులుఉన్నారా? అని ఇతర గ్రహాల గురించి ఎందుకు అన్వేషిస్తాం! అంటే కారణం జీవితం... జీవితాన్ని ప్రేమిస్తుంది. మన ఎగ్జయిట్మెంట్, క్యూరియాసిటీకి ఎలాంటి హద్దులు లేవు. అడవి నుంచి, నదీ తీరాల నుంచి నడిచొచ్చిన మనిషి ప్రయాణంలోకి తొంగి చూస్తే మనం చాలా థ్రిల్ పీలపుతాం. మార్స్ మీద కూడా ఎప్పుడో ఒకప్పుడు జీవం ఉండేదేమో..! ఇప్పటికీ కంటికి కనపడని సూక్ష్మ జీవులేమైనా అక్కడ ఉన్నాయేమో! మనకు తెలియదు కదా!
శని గ్రహానికి ఉన్న ఒక ఉపగ్రహంపై అచ్చంగా భూమి మీద ఉన్న వాతావరణమే ఉందని సైంటిస్టులు చెప్తే ఎగిరి గంతేస్తాం. ఒకవేళ చంద్రయాన్ మిషన్ చంద్రుని మీద బతికేందుకు అనువైన వాతావరణం ఉందని, నీళ్ల జాడలు ఉన్నాయని చెప్తే.. వెంటనే ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాదుఅని ఒక ఆశ పుడుతుంది. ఈ క్యూరియాసిటీ, ఎగ్జయిట్ మెంట్, ఉత్సాహం, సంతోషం అన్ని యూనివర్సల్ లా వల్లే పుడతాయి. ఆకాశం అందుల వరకు జీవితం విస్తరించి ఉంది. అందుకే భూమికి పరిమితం కావడంలో జీవితం సంతృప్తి చెందదు. కాబట్టి, ఎప్పుడూ తన రెక్కల్ని ఇతర కోణాలకు విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. కారణం జీవితం. ..జీవితాన్ని ప్రేమించడమే!
వెలుగు, లైఫ్