సూర్యాపేట జిల్లాలో అడుగడుగునా పోలీస్ చెకింగ్లు.. వేలి ముద్రలను చెక్ చేసిన పోలీసులు !

సూర్యాపేట జిల్లాలో అడుగడుగునా పోలీస్ చెకింగ్లు.. వేలి ముద్రలను చెక్ చేసిన పోలీసులు !

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా నలుమూలల్లో వచ్చిపోయే అన్ని మార్గాలలో పోలీసులు మంగళవారం సాయంత్రం నాకాబంది నిర్వహించారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో టేకుమట్ల గ్రామం జాతీయ రహదారి ఖమ్మం హైవేపై తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ కూడా ఉన్నారు. 

సూర్యాపేట టౌన్లో పల్లెవెలుగు బస్సులో ఒక వ్యక్తి వేలి ముద్రలను ఎస్పీ నరసింహ పరిశీలించారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం లక్ష్యంగా, ఎఫెక్టివ్ పోలీస్ & విజుబుల్ పోలీసింగ్ ఉద్దేశంలో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అష్ట దిగ్బంధనం చేసి తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

నాకాబంది ద్వారా అక్రమ రవాణా, అనుమానితుల, రౌడీషీటర్స్, గంజాయిరవాణా చేసే వారి కదలికల గుర్తింపు కోసం తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 23 ప్రదేశాలలో ఏక కాలంలో పోలీసులు ఈ తనిఖీలు చేశారు. జిల్లా నలుమూలలా సరిహద్దు ప్రాంతాలు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు రామాపురము ఎక్స్ రోడ్, దొండపాడు, పులిచింతల ప్రాజెక్టు, అంతర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోకి వచ్చి పోయే అన్ని మార్గాలలో తనిఖీలు జరిగాయి.