కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ వి.విజయ్‌కుమార్ తెలిపారు. టీఎస్కేసీ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో కాలిబ్యార్, జస్ట్ డయల్, డీబీఎస్ బ్యాంక్, జీయో, డిజిటల్, ముత్తుట్ ఫైనాన్స్ , మెడ్‌ప్లస్‌లో ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు.
ఏదైనా ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ,. పీజీలో 50 శాతం మార్కులతో ఫాస్ అయి, 30 ఏండ్ల లోపు వయస్సు ఉన్న వారు అర్హులని తెలిపారు. ఈ నెల 17న ఉదయం 10.30 గంటల లోపు అభ్యర్థులు బయోడెటా, సర్టిఫికేట్లతో కాలేజీకి రావాలన్నారు.
