ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక సందర్భంగా ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. ఎక్స్ అఫిషియో ఓటు వేయడం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ రఘునందన్ రావులు ఒకే కారులో కలిసి మున్సిపల్ ఆఫీసు దగ్గరికి చేరుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 14గా ఉండగా.. ఎక్స్ అఫిషియో ఓట్లతో ఇస్నాపూర్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా... బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 1వ వార్డు కౌన్సిలర్ మమత కాంగ్రెస్ క్యాంప్ లో చేరారు.కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.
ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ లో చేరగా.. మరో ఇండిపెండెట్ బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 14గా ఉండగా.. కాంగ్రెస్ బలం 12కి చేరింది. ఎక్స్ అఫిషియో ఓట్లతో ఇస్నాపూర్ పీఠం బీఆర్ఎస్ దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
