విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జంట ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాకపోయిన, పెళ్లి జరుగుతుందనే టాక్ మాత్రం రోజురోజుకు బలపడుతోంది. ఈ ఉత్కంఠ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15న) ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ కనిపించడం మరింత చర్చనీయాంశమైంది.
బ్రౌన్ మరియు బ్లాక్ క్యాజువల్ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించిన ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా వీరిద్దరూ ఒకే కారులో వెళుతున్నట్లుగా ఫొటోస్ సైతం దర్శనం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే, మరోసారి వీరి పెళ్లి వార్తలకు మరింత ఊపొచ్చింది.
పలు బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్ పుర్లో ఘనంగా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి 20 నుంచే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయని, సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మొత్తానికి, పెళ్లి వార్తలపై స్పష్టత రాకపోయినా, విజయ్-రష్మిక జంటపై అభిమానుల్లో ఆసక్తి మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్తలు ఊహాగానాలుగానే కొనసాగనున్నాయి.
నిశ్చితార్థం!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నల నిశ్చితార్థ వేడుక ఇప్పటికే నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. 2025 అక్టోబర్ 3, శుక్రవారం నాడు ఈ జంట ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఈ వార్తను ధృవీకరించడానికి కానీ, ఖండించడానికి కానీ ఇద్దరు నటులు ఇంకా ముందుకు రాలేదు.
నాలుగేళ్ల రహస్య ప్రేమాయణం
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా 'గీత గోవిందం' (2018) సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' (2019)లో నటించారు. ఈ రెండు సినిమాల్లో వారి కెమిస్ట్రీ అద్భుతంగా పండడంతో, తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ వీరి మధ్య ఏదో ఉందని సినీ విశ్లేషకులకులతో పాటు అభిమానుల్లో ఒక అంచనాకు వచ్చారు.
ముఖ్యంగా, ముంబైలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో ఈ జంట నివసిస్తున్నారనే వార్తలు, ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లిన సందర్భాలు , జిమ్ సెషన్స్‌కు హాజరవడం.. వంటివి వారి ప్రేమాయణానికి మరింత బలం చేకూర్చాయి. చాలాసార్లు ఇద్దరూ తమ సంబంధాన్ని కేవలం 'మంచి స్నేహం'గా మాత్రమే పేర్కొన్నప్పటికీ, ఇరు కుటుంబాలు అంగీకరించి, గోప్యంగా నిశ్చితార్థం చేశారని, ఇప్పుడు పెళ్లి కూడా జరుపుతున్నారనే వార్తలు విజయ్-రష్మిక అభిమానులకు తీపి కబురుగా మారింది.
#RashmikaMandanna and #VijayDeverakonda arrived at the airport together. 😍#FilmfareLens pic.twitter.com/elQvBvf8Nd
— Filmfare (@filmfare) February 16, 2026
