- స్టూడెంట్స్ హెల్త్ పై ఎస్సీ గురుకుల సొసైటీ ఫోకస్
- ఉదయం 6 గంటలకల్లా సిక్ స్టూడెంట్స్ పోర్టల్ లో వివరాలు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్ పై గురుకుల సొసైటీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఎస్సీ గురుకుల సొసైటీ హెడ్ ఆఫీస్ లో హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. రాష్ర్టంలోని ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 264 స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో సుమారు లక్షన్నర మంది స్టూడెంట్లు చదువుతున్నారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, పాము, తేలుకాటు, ఇతర సంఘటనలు నిత్యం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఇటీవల సొసైటీ పరిధిలో హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ జాయింట్ సెక్రటరీ ఆధ్వర్యంలో రన్ అవుతుండగా ఇందులో అడిషనల్ సెక్రటరీ, ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు హెల్త్ సూపర్ వైజర్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు.
ఉదయం 6 గంటలకే వివరాలు అప్ డేట్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ లో ఎవరు సిక్ అయ్యారన్న వివరాలను అక్కడ పనిచేస్తున్న హల్త్ సూపర్ వైజర్ నుంచి తీసుకొని రోజూ ఉదయం 6 గంటల వరకు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తున్నారు. పోర్టల్ లో స్కూల్ నేమ్ క్లిక్ చేయగానే స్టూడెంట్ వివరాలు, రోగం, ట్రీట్ మెంట్ వివరాలు అప్ డేట్ చేస్తున్నారు.
పోర్టల్ లో జిల్లా, స్కూల్ లేదా కాలేజ్ పేరు, కోడ్, ఏ స్టూడెంట్ సిక్ అయ్యారు, కారణం ఏంటి, ఏ మందులు ఇచ్చారు, ప్రస్తుత పరిస్థితి ఏంటి, సీరియస్ గా ఉంటే జిల్లా లేదా హైదరాబాద్ కు తరలించడం వంటి సలహాలను ఉన్నతాధికారుల సలహాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వాహకులు స్కూల్ హెల్త్ సూపర్ వైజర్లకు తెలపుతున్నారు.
ఉదయం 9 గంటలకు ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య, జాయింట్ సెక్రటరీ, అడిషన్ సెక్రటరీ, ఏడుగురు జోనల్ ఆఫీసర్లు, 3 మల్టీజోనల్ ఆఫీసర్లు, కమాండ్ కంట్రోల్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తూ సిక్ అయిన స్టూడెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నారు.
సీజనల్ వ్యాధులపై అలర్ట్
పాము, తేలుకాటుకు స్టూడెంట్ గురైతే వెంటనే యాంటీవీనోమ్ వ్యాక్సిన్ ను హెల్త్ సూపర్ వైజర్లు అందించి పీహెచ్ సీ లేదా జిల్లా హాస్పిటల్ కు రిఫర్ చేస్తున్నారు. వీటితో పాటు జ్వరం, వీక్ నెస్ , సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా ఎప్పటికపుడు స్కూల్ సూపర్ వైజర్లకు పలు సలహాలు సూచనలు ఇస్తున్నారు.
