Allu Sirish: తొలి శుభలేఖ మామయ్యకే.. చిరంజీవి దంపతుల ఆశీస్సులు తీసుకున్న అల్లు శిరీష్!

Allu Sirish: తొలి శుభలేఖ మామయ్యకే.. చిరంజీవి దంపతుల ఆశీస్సులు తీసుకున్న అల్లు శిరీష్!

అల్లు వారి ఇంటి పెళ్లి సందడి స్టార్ట్ అయింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు యంగ్ హీరో శిరీష్ మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.  తన ప్రేయసి నయనికను మార్చి 6న వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో అల్లు కుటుంబం 'పెళ్లి పిలుపు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల పసుపు దంచుడు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇప్పుడు బంధువులను, సన్నిహితులను, ప్రముఖులను కలిసి పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. 

తొలి పెళ్లి ఆహ్వాన పత్రిక మామయ్యకే..

మన తెలుగువారి ఆచారాల ప్రకారం మొదటి శుభలేఖను అత్యంత సమీప బంధువులకు అందిస్తాం. అలానే అల్లు అరవింద్ దంపతులు, చిరంజీవి దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించి సాదరంగా వివాహానికి ఆహ్వానించారు. ఈ విషయాన్ని తన ఇస్టాగ్రామ్ లో శిరీష్ వెల్లడించారు. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి ఆహ్వాన పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించి వారి ఆశీస్సులు తీసుకున్నానని అని చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరు చేతికి ఏమైంది? 

అయితే శిరీష్ షేర్ చేసిన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి షోల్డర్ బ్యాగ్ వేసుకుని కన్పించారు. ఇది గమనించిన అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయనకు ఏమైంది.. సర్జరీ ఏమైనా జరిగిందా.. అంటూ ఆరా తీస్తున్నారు .  ఇటీవలే మెగాస్టార్ భుజానికి చిన్న పాటి సర్జరీ జరిగింది. వైద్యుల సూచన మేరకు ఆ షోల్డర్ బ్యాగ్ ను ధరించినట్లు సమాచారం. ప్రస్తుతం చిరు కోలుకుంటాన్నారని తెలియడంతో అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. తన  అన్నవదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లి రోజే .. అల్లు శిరీష్ , నయనిక వివాహం ఫిక్స్ చేయడం విశేషం...