
నిజామాబాద్: జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ అనటం హాస్యాస్పదమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అసలు రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. నిజామాబాద్లో అర్వింద్మాట్లాడుతూ జూ బ్లీహిల్స్ అపార్టుమెంటులో 43 ఓట్లు దొంగ ఓట్లైతే, బోధన్లో బీఆర్ఎస్ హయాంలో 42 దొంగ పాస్పోర్టులు ఇచ్చిన సంగతి మరిచారా అంటూ ఫైర్అయ్యారు. బంగ్లాదేశ్, మయన్మార్ దే శస్తులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని గుర్తుచేశారు.
జూబ్లీహిల్స్ క్లబ్బుల్లో డ్రగ్స్, మత్తు పదార్థాలు సప్లై చేసింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజ ర్వేషన్ అంశంలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని విమర్శించా రు.
నిజామాబాద్ జిల్లాలో ఆర్వోబీల నిధులు వెంటనే విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేపడతానని.. దీపావళి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇస్తున్నా అంటూ వార్నింగ్ ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వాస్తవాలు తెలుసుకోకుండ. . కేంద్రంపై తప్పుడు స్టేట్ మెంట్స్ ఇవ్వొద్దని సూచించారు.