ప్రపంచంలో ఎన్నో సమస్యలున్నాయి. ఒకవేళ సమస్యలు లేకపోయినా అందరికీ కామన్ సమస్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్. టారిఫ్ లు, సాంక్షన్ లతో ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్నాడు. వ్యాపార వాణిజ్యాలపై కోలుకోలేని దెబ్బ తీస్తున్నాడు.
ఇటీవలే వెనుజాలను కంట్రోల్ లోకి తీసుకున్న ట్రంప్.. గ్రీన్ లాండ్ పై కూడా కన్నేశాడు. గ్రీన్ లాండ్ ను ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించడంపై కొన్ని దేశాలు వ్యతిరేకించాయి. దీంతో నా నిర్ణయాన్నే వ్యతిరేకిస్తారా..? అయితే కాచుకోండి.. మీకు ఫైన్ గా 10 శాతం టారిఫ్ లు విధిస్తున్నాను.. అంటూ సంచలన ప్రకటన చేశాడు.
గ్రీన్ లాండ్ ఆక్రమణను వ్యతిరేకించిన డెన్ మార్క్, యూకే, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలపై టారిఫ్ లను విధిస్తున్నట్లు ప్రకటించాడు ట్రంప్. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు ట్రూత్ సోషల్ లో శనివారం (జనవరి 17) పోస్ట్ చేశాడు.
►ALSO READ | చైనాలో 100 మందికి పైగా విద్యార్థులకు సోకిన 'నోరోవైరస్'.. అసలు ఏంటి ఈ వైరస్?
మరోవైపు గ్రీన్‌లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అమెరికా పట్టుదల, డెన్మార్క్ అభ్యంతరం, ఐరోపా దేశాల మద్దతు కలిసి ఈ మంచు ఖండం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది.
గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ ద్వీపం తమకు అత్యంత కీలకమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదని వారు తెగేసి చెబుతున్నప్పటికీ.. అమెరికా మాత్రం 'టెక్నికల్ చర్చల' పేరుతో తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిణామాలతో మంచు ప్రాంతంలో ఒక్కసారిగా హీట్ పెరిగిపోతోంది.
