- జనరల్ మహిళకు గ్రేటర్ హైదరాబాద్
- ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ మేయర్ పదవులూ ఆ కేటగిరీకే రిజర్వ్
- జనరల్ కోటాలోకి వరంగల్
- కరీంనగర్, మంచిర్యాల బీసీ జనరల్.. పాలమూరు బీసీ మహిళకు
- రామగుండం ఎస్సీకి, కొత్తగూడెం ఎస్టీకి రిజర్వ్
- 10 మేయర్, 121 చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
- గతంలో జనరల్ స్థానాల్లో కొన్ని పదవులు ఈ సారి రిజర్వేషన్ కోటాలోకి
- రొటేషన్‌తో మారిన స్థానాలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్హైదరాబాద్ మేయర్ పీఠంఈసారి కూడా మహిళకే దక్కబోతున్నది. తాజాగా ప్రకటించిన రిజర్వేషన్లలో జీహెచ్ఎంసీ సహా ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ మేయర్పదవులూ జనరల్మహిళకే రిజర్వ్ అయ్యాయి. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవిని మాత్రం జనరల్‌కు కేటాయించారు. కరీంనగర్, మంచిర్యాల మేయర్ పీఠాలు బీసీ జనరల్‌కు రిజర్వ్ కాగా, పాలమూరు బీసీ మహిళకు, రామగుండం ఎస్సీలకు, కొత్తగూడెం ఎస్టీలకు దక్కాయి.
మొత్తం మీద గ్రేటర్హైదరాబాద్ సహా 5 మేయర్ పీఠాలపై మహిళలే కొలువుదీరబోతున్నారు. మున్సిపల్ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కారు కీలకమైన రిజర్వేషన్లను శనివారం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 మేయర్, 121 మున్సిపల్ చైర్‌పర్సన్, వార్డులవారీగా రిజర్వేషన్లను సీడీఎంఏ కమిషనర్ శ్రీదేవి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించగా, మిగతా 50 శాతం సీట్లను జనరల్‌కు కేటాయించారు. మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేశారు.
ప్రస్తుతం ఎన్నికలు జరగని 3 మేయర్, 5 మున్సిపల్ చైర్ పర్సన్ రిజర్వేషన్లను ముందుగానే ప్రకటించినా, ఆయా చోట్ల వార్డుల రిజర్వేషన్లను మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించబోయే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, వీటి పరిధిలోని 2,996 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసినట్లు కమిషనర్ శ్రీదేవి వెల్లడించారు.
రొటేషన్‌తో మారిన స్థానాలు
మున్సిపల్ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రొటేషన్పద్ధతిని పాటించింది. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు, బీసీ డెడికేటెడ్కమిషన్రిపోర్ట్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు కేటాయించినట్లు సీడీఎంఏ కమిషనర్ శ్రీదేవి తెలిపారు. కానీ డీలిమిటేషన్, గ్రామాల విలీనం జరిగిన వాటిని కొత్త కార్పొరేషన్లు/మున్సిపాలిటీలుగానే పరిగణించడం వల్ల కొన్ని చోట్ల రిజర్వేషన్లు మారలేదన్నారు.
ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నల్గొండ కార్పొరేషన్లలో మేయర్స్థానాలు యాదృచ్ఛికంగా జనరల్ మహిళకు రిజర్వ్అయ్యాయని తెలిపారు. ఇక కరీంనగర్ మేయర్స్థానాన్ని గతంలో జనరల్‌కు కేటాయించగా.. ఈ సారి బీసీ జనరల్‌కు రిజర్వ్‌చేశారు. కొత్తగూడెం జనరల్ మహిళ నుంచి ఎస్టీ జనరల్‌కు, గ్రేటర్వరంగల్ మేయర్స్థానం జనరల్‌నుంచి బీసీ జనరల్‌కు, నిజామాబాద్ బీసీ జనరల్‌నుంచి జనరల్స్థానాలకు మారిపోయాయి.
మున్సిపాలిటీల్లోనూ మార్పులు..
మున్సిపాలిటీల విషయానికొస్తే గతంలో జనరల్‌గా ఉన్న మహబూబాబాద్చైర్పర్సన్స్థానం ఇప్పుడు ఎస్టీ జనరల్‌కు, జనరల్ మహిళగా ఉన్న బూత్పూర్ ఎస్టీ జనరల్‌కు, జనరల్ మహిళగా ఉన్న చొప్పదండి, హుజూరాబాద్, చేర్యాల, వికారాబాద్, మోత్కూర్ ఎస్సీ మహిళకు, హుస్నాబాద్ ఎస్సీ జనరల్‌కు, జనరల్‌గా ఉన్న జమ్మికుంట, లక్సెట్టిపేట ఎస్సీ జనరల్‌కు కేటాయించారు.
అలాగే జనరల్, జనరల్ మహిళా స్థానాలుగా ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుజూర్‌నగర్, పెద్దపల్లి, మంథని, వేములవాడ, షాద్‌నగర్, తాండూర్, పరిగి, ఆత్మకూర్, ఆలేర్, ఇల్లందు, జనగామ, కామారెడ్డి, కాగజ్‌నగర్, చెన్నూర్, మెదక్, అచ్చంపేట, నాగర్ కర్నూల్చైర్పర్సన్స్థానాలు ఈసారి బీసీలకు దక్కాయి. జగిత్యాల, నర్సంపేట, కొల్లాపూర్‌లో మాత్రం పాత పద్ధతిలోనే మరోసారి బీసీ మహిళకే అవకాశం వచ్చింది.
మున్సిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్లు
-
కొత్తగూడెం ఎస్టీ జనరల్
-
రామగుండం ఎస్సీ జనరల్
-
మంచిర్యాల బీసీ జనరల్
-
కరీంనగర్ బీసీ జనరల్
-
మహబూబ్‌నగర్ బీసీ మహిళ
-
గ్రేటర్ వరంగల్ జనరల్
-
గ్రేటర్ హైదరాబాద్ జనరల్ మహిళ
-
ఖమ్మం జనరల్ మహిళ
-
నిజామాబాద్ జనరల్ మహిళ
-
నల్గొండ జనరల్ మహిళ
మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు
మొత్తం 121
ఎస్టీ 3
ఎస్టీ మహిళ 2
ఎస్సీ 9
ఎస్సీ మహిళ 8
బీసీ 19
బీసీ మహిళ 19
జనరల్ (అన్ రిజర్వ్‌డ్) 30
జనరల్ (అన్రిజర్వ్డ్) మహిళ 31
మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు
-
ఎస్టీ జనరల్: (కొల్లూరు, బూత్పూర్, మహబూబాబాద్)
-
ఎస్టీ మహిళ: (కేసముద్రం, యెళ్లంపేట)
-
ఎస్సీ జనరల్: (స్టేషన్ ఘన్పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్సెట్టిపేట, మూడు చింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహిర్, హుస్నాబాద్)
-
ఎస్సీ మహిళ: (చొప్పదండి, హుజూరాబాద్, ఏదులాపురం, గడ్డపోతారం, ఇంద్రేశం, చేర్యాల, వికారాబాద్, మోత్కూర్)
-
బీసీ జనరల్: (హుజూర్‌నగర్, తాండూర్, మద్దూర్, పెద్దపల్లి, మంథని, నాగర్‌కర్నూల్, వేములవాడ, షాద్‌నగర్, జిన్నారం, జహీరాబాద్, గుమ్మడిదల, సిద్దిపేట, జనగామ, భూపాలపల్లి, ఐజా, వడ్డెపల్లి, ఆలంపూర్, బిచ్కుంద, అసిఫాబాద్)
-
బీసీ మహిళ: (కాగజ్‌నగర్, దేవరకొండ, చెన్నూర్, మెదక్, ములుగు, కొల్లాపూర్, కామారెడ్డి,బాన్సువాడ, ఇల్లందు, జగిత్యాల, అచ్చంపేట, దేవరకొండ, గజ్వేల్, దుబ్బాక, పరిగి, కొత్తకోట, ఆత్మకూర్, నర్సంపేట, ఆలేరు)
-
జనరల్ (అన్ రిజర్వ్‌డ్) : (పరకాల, రాయికల్, మెట్‌పల్లి, ఎల్లారెడ్డి, జడ్చర్ల, తొర్రూర్, చండూర్, నకిరేకల్, హాలియా, కోస్గీ, మక్తల్, ఖానాపూర్, భైంసా, బోధన్, సుల్తానాబాద్, శంకరపల్లి, చేవేళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్, కొత్తూర్, నారాయణఖేడ్, ఆందోల్–జోగిపేట్, సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచెర్ల, కొడంగల్, అమరచింత, పెబ్బేర్, వర్ధన్నపేట, పోచంపల్లి)
-
జనరల్ (అన్ రిజర్వ్‌డ్) మహిళ: (ఆదిలాబాద్, అశ్వరావుపేట, కోరుట్ల, ధర్మపురి, గద్వాల, సత్తుపల్లి, వైరా, మధిర, మరిపెడ, క్యాతనపల్లి, బెల్లంపల్లి, రాయాయంపేట, నర్సాపూర్, తూఫ్రాన్, అలియాబాద్, కల్వకుర్తి, మిర్యాలగూడ, చిట్యాల, నారాయణపేట్, నిర్మల్, భీంగల్, ఆర్మూర్, సిరిసిల్ల, సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్, వనపర్తి, కోదాడ, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్.
