సీఎం కుర్చీ మీ అయ్య జాగీరా..? రెండేండ్లకే నన్ను దిగిపో దిగిపో అంటున్నరు: సీఎం రేవంత్‌‌

సీఎం కుర్చీ మీ అయ్య జాగీరా..? రెండేండ్లకే నన్ను దిగిపో దిగిపో అంటున్నరు: సీఎం రేవంత్‌‌
  • 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదిస్తే
  • కూర్చున్న.. మీరు చెప్తే దిగిపోతనా?
  • మీరు సక్కగా  పాలించకనే ప్రజలు మమ్మల్ని తెచ్చుకున్నరు
  • పదేండ్లు ఎట్లా పాలించాలో తెలుసు
  • మీ పాలనలో ఒక్క ప్రాజెక్టూ తేలే.. 20 లక్షల కోట్ల బడ్జెట్‌‌ పెట్టి విద్యకు ఇచ్చింది సున్నా.. 
  • కనీసం గురుకులాలకు భవనాలు.. స్టూడెంట్లకు బాత్రూమ్‌‌లూ కట్టలే
  • ఎడ్యుకేషన్‌‌కే మా సర్కారు తొలి ప్రాధాన్యం..  వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడ్తున్నం
  • నడుము విరిగి ఫామ్‌‌హౌస్​లో ఉన్న కేసీఆర్ నాకు శత్రువు కాదు 
  • పేదరికమే తన అసలైన శత్రువని కామెంట్​
  • పాలమూరులో ట్రిపుల్ ఐటీ భవనాలకు శంకుస్థాపన

మహబూబ్‌‌నగర్, వెలుగు: నాలుగు కోట్లమంది ఆశీర్వదిస్తేనే తాను సీఎం సీట్లో కూర్చున్నానని, పాలన ఎలా చేయాలో.. సమస్యలు ఎలా పరిష్కరించాలో తనకు బాగా తెలుసని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘నేను సీఎం అయి రెండేండ్లు కాలేదు. కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్‌‌ రావు నన్ను దిగిపో దిగిపో అంటున్నారు. సీఎం కుర్చీ మీ అయ్య జాగీరా!? మీ తాతలు ఇచ్చిన ఆస్తా?  మీరు చెబితే దిగిపోతానా?’’ అని ఫైర్​అయ్యారు. శనివారం మహబూబ్‌‌నగర్​ జిల్లాలో సీఎం 
రేవంత్‌‌రెడ్డి పర్యటించారు. జడ్చర్ల మండలం చిట్టబోయిన్‌‌పల్లి వద్ద ట్రిపుల్​ఐటీ భవన నిర్మాణాల కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల స్టూడెంట్స్​తో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు.

అక్కడి నుంచి మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎంవీఎస్​ డిగ్రీ కాలేజ్​ వద్దకు చేరుకున్నారు. అక్కడే రూ.1,284 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంవీఎస్​ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాళ్లు పడావు పెట్టిన ప్రాజెక్టులను, నిధులు ఇవ్వకుండా అడ్డుకున్న బడుల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ‘‘నచ్చితే ఆశీర్వదించు, నచ్చకపోతే నీ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే విశ్రాంతి తీసుకో’’ అని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. 

పదేండ్లలో ఒక కొత్త ప్రాజెక్టునైనా తెచ్చారా?

అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో గొప్ప విజయాలు సాధించామని కేటీఆర్, హరీశ్​రావు  చెప్పుకుంటున్నారని, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక అన్ని పనులు ఆగిపోయాయని మాట్లాడుతున్నారని రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మండిపడ్డారు.‘‘కేసీఆర్​ పదేండ్లు అధికారంలో ఉండి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క కొత్త ప్రాజెక్టునైనా మంజూరు చేశారా? భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్​, పాలమూరు–-రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులు ఎవరి హయాంలో మంజూరయ్యాయి. ఆ ప్రాజెక్టులను పదేండ్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టింది ఎవరు? కేసీఆర్​.. ఇదే నా సవాల్​. మీరు అనుమతి ఇచ్చిన ప్రాజెక్టు  పాలమూరు జిల్లాలో ఒక్కటైనా ఉందా?  ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టా. 

ఈ ప్రాజెక్టు కోసం ఉమ్మడి ఏపీలో అప్పటి పాలమూరు ఎంపీ విఠల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు  నాటి సీఎం వైఎస్​ రాజశేఖర్​ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన తర్వాత నాటి మంత్రిగా డీకే అరుణ, పాలమూరు ఎమ్మెల్యేగా యెన్నం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సంతకాలు చేస్తే.. 2013లో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఈ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చారు. మా గురించి మాట్లాడుతున్న కేసీఆర్..​ 2014లో తెలంగాణ వచ్చాక పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును నువ్వు పదేండ్లలో ఎందుకు పూర్తి చేయలేదు. పాలమూరు పథకానికి సంబంధించి రూ.25 వేల కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించి, ఉద్దండాపూర్​ నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదు? భీమా-1లో భాగంగా సంగంబండ రిజర్వాయర్​ కాలువకు అడ్డుగా బండ ఉంటే.. ఆ బండను తొలగించడానికి రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదు.

 నువ్వు ఈ నిధులు ఇచ్చి ఉంటే.. 12 వేల ఎకరాలకు సాగునీరు అందేది. నేను సీఎం అయ్యాక సంగంబండ బండ పగలగొట్టడానికి రూ.12 కోట్లు మంజూరు చేశా.  కల్వకుర్తి కింద భూ సేకరణ విషయాన్ని అప్పటి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి  నీ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకున్నావా? నువ్వు ఆనాడే నిధులు మంజూరు చేసి ఉంటే.. మాడ్గుల వరకు కృష్ణా జలాలు పారేవి. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.75 కోట్లు నిధులు ఇచ్చాం. ఉద్దండాపూర్​ బాధితులకు పరిహారం డబ్బులను మంజూరు చేసినం” అని వెల్లడించారు. 

బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను గెలిపించినా న్యాయం చేయలే..

కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిఫ్ట్​ ఆషామాషీగా రాలేదని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. వైఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మాట్లాడారని చెప్పారు. ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని, ఎత్తిపోతల అసవరమని, భీమా ఎక్స్​టెన్షన్​ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కోరినట్టు గుర్తు చేశారు. ఆయన మరణంతో ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. కానీ తాను కొడంగల్​ ఎమ్మెల్యేగా గెలిచాక ఈ లిఫ్ట్​ను సాధించుకునే బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. 

 ఆనాటి ప్రభుత్వం సర్వేలకు కూడా నిధులు మంజూరు చేసిందన్నారు. రూ.1,500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఉమ్మడి ఏపీలో చివరగా జీవో 69ను జారీ చేశారన్నారు. కానీ కేసీఆర్​ అధికారంలోకి వచ్చాక పదేండ్లు అధికారంలో ఉండి ఈ ప్రాజెక్టును టేకప్​ చేయలేదని మండిపడ్డారు. మక్తల్​, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ ఎమ్మెల్యేలను, పాలమూరు పార్లమెంట్​ నుంచి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపీగా గెలిపించినా.. ఎందుకు ఈ ప్రాజెక్టు మీద వివక్ష చూపారని ప్రశ్నించారు.

 తాను అధికారంలోకి వచ్చాక కొడంగల్​ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిధులు మంజూరు చేయించానని చెప్పారు. 96 శాతం భూమి పోయే రైతులను ఒప్పించి వంద రోజుల్లో నష్టపరిహారం చెల్లించి.. ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేశామన్నారు. ఈ జిల్లా వాడిని కాబట్టి ఈ ప్రాంత సమస్యలు, రైతుల కష్టాలు అర్థం చేసుకుంటున్నానని అన్నారు. జూరాల పాత బ్రిడ్జి దెబ్బతింటున్నదని, కొత్త బ్రిడ్జి కావాలంటే రూ.123 కోట్లు మంజూరు చేశానన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్​ ఈ పనులన్నీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

వారికి మన అభివృద్ధిని చూపించాలి

గతంలో  దేశంలో  బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమెరికా అధ్యక్షులు పర్యటించేవారని, ఆనాటి సీఎంలు వారిని మన ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడి పేదరికాన్ని చూపేవారని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. ‘‘ఇక్కడ ప్రజలు వలస పోతున్నారు, తిండి లేదు, బట్ట లేదు అని వారికి చూపించి అభివృద్ధి కోసం బిచ్చం వేయాలని అడిగేవారు. ఇది ఎంత బాధాకరం. అందుకే మన అభివృద్ధిని చూపించాలి. మన ప్రాజెక్టులను చూపాలి, ట్రిపుల్​ ఐటీ, ఐఐఎంలను చూపించాలి. పాలమూరు నుంచి దేశానికి సేవలు అందించాలి. ఈ అవకాశం అందిపుచ్చుకోవాలి” అని పిలుపునిచ్చారు. 

ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని  అన్నారు. ఉచితంగా ఏమిచ్చినా అది శాశ్వతం కాదన్నారు. విద్య ఒక్కటే శాశ్వతమని, విజ్ఞానం ఉంటేనే రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలగలిగే స్థాయికి చేరుతామన్నారు. అందుకే ఎడ్యుకేషన్​, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే తమ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయారిటీ అని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, జీవితంలో పైకి రావాలని సూచించారు.

 చదువే మన భవిష్యత్తును  మారుస్తుందన్నారు. పాలమూరు పేదరికం పోవాలని, పంటలు పండి రైతుల కండ్లల్లో ఆనందం నిండాలని.. అందుకు మన ప్రాజెక్టులకు పూర్తి చేసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్​ ప్రాజెక్టులను పూర్తి చేస్తానని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ భూ సేకరణ, ఆర్​అండ్​ఆర్​ ప్యాకేజీ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఉందో తెలుసుకొని.. మొదటి వాటికి పరిహారం ఇప్పించాలని సూచించారు. 

నిధుల కోసమే ప్రధానిని కలిశా..

గిట్టని వాళ్లు కొందరు తాను పదే పదే ప్రధాని మోదీని కలుస్తున్నానని అంటున్నారని, ప్రధానిని కలవకుంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు కావాలంటే ఇచ్చే వారి దగ్గరికి వెళ్లాల్సిందేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రధాని కీలకం అని పేర్కొన్నారు. తెలంగాణకు ఇచ్చే నిధులు, అనుమతులు సాధించుకునేందుకు ప్రధానిని కలుస్తామని స్పష్టం చేశారు. తనకు ఎవరూ శత్రువులు లేరని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు.

 ‘‘రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారిని 2023 ఎన్నికల్లో బండకేసి కొట్టినం. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పార్లమెంట్​ ఎన్నికల్లో గుండసున్నా చేసినం. కంటోన్మెంట్​, జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో ఓడించినం. ఇటీవల జరిగిన సర్పంచ్​ ఎన్నికల్లో 60 శాతం సర్పంచులను గెలిపించుకున్నం. నడుము విరిగి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కేసీఆర్ నాకెందుకు శత్రువు అయితడు. లేచి సక్కగా నిలబడి  మాట్లాడలేని వ్యక్తితో నేనేం మాట్లాడుతా” అని వ్యాఖ్యానించారు. 

నిరక్షరాస్యత, పేదరికం, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసేవారు, చదువుకోకుండా ఊళ్ల మీద పడి తిరిగేటోళ్లు, చదువుకు అడ్డం తగిలేవారే తన శత్రువులని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే తన బాధ్యత అని, పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటేదాకా తరమాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. త్వరలో జరిగే మున్సిపల్​ ఎన్నికల్లో మంచోళ్లను, మనోళ్లను, మంత్రులతో కలిసి పనిచేసే వారిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపల్​ ఎన్నికలు ముగిశాక పాలమూరుకు మళ్లీ వస్తానని.. అప్పుడు వందల కోట్ల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చారు. 


నాడు ఏంచేయనోళ్లే ఇప్పుడు పొంకనాలు కొడుతున్నరు

గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసి కూడా ఏమీ చేయని నాయకులే ఇప్పుడు పొంకనాలు కొడుతున్నారని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫైర్​ అయ్యారు. ‘‘పెండింగ్​ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న మీరు ఆనాటి ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారే కదా? మంత్రి హోదాలో ఉన్నా ఒక్కసారి కూడా కేసీఆర్​ వద్దకు వెళ్లారా? పాలమూరు పెండింగ్​ ప్రాజెక్టులకు నిధులు కావాలని అడిగారా? మీకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడిగే ధైర్యం కూడా లేదు. మీకు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్​లోకి కూడా అనుమతి ఉండేది కాదు. ఈ పనులన్నీ చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం మీ చేతకానితనం” అని మండిపడ్డారు. 

75 ఏండ్ల తర్వాత పాలమూరు బిడ్డనైన తనకు సీఎంగా అవకాశం వచ్చిందని.. అది కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నచ్చడం లేదన్నారు.  ‘‘ మా చెప్పు చేతల్లో ఉండాల్సిన వారు, మా మోచేతి నీళ్లు తాగే వారు పాలన చేస్తున్నారని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కడుపు మంట. అందుకే కుట్రలతో నాటకాలు మొదలుపెట్టారు. సభలు, సమావేశాలు పెట్టి ఉపన్యాసాలు ఇస్తున్నారు. జబ్బలు జర్సుకుంటున్నారు. కేసీఆర్​ సభకు రావాలని, ఎవరు ఏంటో ప్రజలకు చెబుదామని శాసనసభలో సవాల్​ విసిరినా. సవాల్​ ప్రకారం సభలో నీళ్లు, నిజాల గురించి ప్రజలకు వివరించా.  తెలంగాణకు ప్రాజెక్టులు తెచ్చి, వాటిని పూర్తి చేసి ఉంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడగడానికి, కడగడానికి  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఉండేది. సభలో చర్చకు పెడితే రారు. సభలో ప్రజల సమస్యల గురించి మాట్లాడమంటే.. ఇవేవి మాట్లాడకుండానే బయటకు వెళ్లిపోయారు. అలాంటి వాళ్లు నన్ను ప్రశ్నించే వారా?” అని అన్నారు.  

మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని, పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు 20 లక్షల కోట్ల బడ్జెట్​ ఎక్కడ ఖర్చు చేశారు. ఆ లెక్కలు ఎందుకు చెప్పడం లేదు. మీ హయాంలో లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. పెండింగ్​ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. మీరు కొత్తగా కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నయ్‌‌? గురుకులాలు మంజూరు చేశామని చెప్పుకుంటున్న మీరు.. కనీసం వాటికి సొంత భవనాలు కూడా కట్టివ్వలేదు.  ఆ హాస్టల్స్‌‌లో ఉంటున్న విద్యార్థులు గూడు లేక, సరైన బాత్​ రూమ్‌‌లు లేక ఇబ్బందులు పడుతున్నారు.