ఆర్సీబీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఆ నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం.. ఇక ఫుల్ జోష్ !

ఆర్సీబీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఆ నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం.. ఇక ఫుల్ జోష్ !

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్యాన్స్ ఇది నిజంగా గుడ్ న్యూసే. ఆర్సీబీ గత ఐపీఎల్ సీజన్ టైటిల్ గెలుపు తర్వాత జరిగిన తొక్కిసలాట కారణంగా విధించిన నిషేధాన్ని తొలగిస్తూ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా జరిగిన సంబరాల్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి స్టేడియంలో ఎలాంటి మ్యాచులు జరగకుండా నిషేధం విధించారు. లేటెస్టుగా ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచులు నిర్వహించేందుకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి అనుమతినిచ్చింది. 

లేటెస్టుగా ప్రభుత్వ నిబంధనలు, షరతులకు అనుగుణంగా మ్యాచులు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది కర్ణాటక ప్రభుత్వం. 

2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడంతో ఆర్సీబీ యాజమాన్యం 2025, జూన్ 4న బెంగుళూర్‎లో విక్టరీ పరేడ్, చినస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. విజయోత్సవ ర్యాలీకి అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.