కమర్షియల్ కాంట్రాక్ట్ రిజెక్ట్ చేసిన కోహ్లీ.. RCB ని వీడుతున్నాడా.. లేక IPL కు గుడ్ బై చెబుతాడా..?

కమర్షియల్ కాంట్రాక్ట్ రిజెక్ట్ చేసిన కోహ్లీ.. RCB ని వీడుతున్నాడా.. లేక IPL కు గుడ్ బై చెబుతాడా..?

కింగ్ కోహ్లీ ఆర్సీబీ కమర్షియల్ కాంట్రాక్ట్ రిజెక్ట్ చేయడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఇప్పటికే టెస్టులు, టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. అటు వన్డే కెరీర్ అగమ్యగోచరంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే వరల్డ్ కప్  ఆడతాడా లేదా బీసీసీఐ పక్కన పెడుతుందా అనే చర్చలు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ తన కాంట్రాక్ట్ రిజెక్ట్ చేయడం టాక్ ఆఫ్ ద క్రికెట్ వరల్డ్ గా మారింది. 

ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న కొద్ది మంది ప్లేయర్లలో కోహ్లీ ఒకరు. మొదటి నుంచీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కి ఆడుతున్నాడు. నెక్స్ట్ ఐపీఎల్ కోసం ఆక్షన్ దగ్గరపడుతున్న టైమ్ లో కోహ్లీ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆర్సీబీని వీడుతున్నాడా.. అనే డౌట్స్ ఇప్పుడు సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్నాయి. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టాపిక్ పై మహమ్మద్ కైఫ్ క్లారిటీ ఇచ్చాడు. బెంగళూరు ఫ్రాంచైజీ కి ఆడటానికి కోహ్లీ కట్టుబడి ఉన్నాడని కైఫ్ తెలిపాడు. అదే విధంగా కొత్త కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదని కూడా చెప్పాడు. కోహ్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ మ్యాచ్ బెంగళూరుకే ఆడతానని ప్రామిస్ చేశాడు. అదే మాట మీద ఉంటాడు.. అని ఇన్ స్టాలో  వీడియో పోస్ట్ చేశాడు కైఫ్.

ఆర్సీబీ కాంట్రాక్ట్ కు సైన్ చేయకపోవడానికి కారణం చెప్పాడు కైఫ్. త్వరలో ఆర్బీసీ ఫ్రాంచైజ్ మారుతోందని.. కొత్త ఫ్రాంచైజ్ వచ్చిన తర్వాత .. అన్ని చర్చల తర్వాత కొత్త కాంట్రాక్ట్ ఉంటుందని తెలిపాడు. అందుకోసమే కోహ్లీ వెయిట్ చేస్తున్నట్లు కైఫ్ వివరణ ఇచ్చాడు.