
ఢిల్లీ: భారతదేశపు సెమీహైస్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వందేభారత్ 4.0 అభివృద్ధి చేయ నున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో దేశాన్ని గ్లోబల్ సప్లయిర్గా మార్చే దిశగా కీలక అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇది రైల్ సెక్టా ర్ లో భారతీయ నైపుణ్యాన్ని, అంతర్జాతీయ మా ర్కెట్లో అవకాశం పెంచుతుందన్నారు.
సీఐఐ ఇంటర్నేషనల్ రైల్ కాన్ఫరెస్లో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ‘మోదీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధి పై బలంగా ఫోకస్చేసింది. 11 ఏండ్లల్లో 35,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ల నిర్మాణం చేపట్టాం. జపాన్ బుల్లెట్ రైల్ నెట్ వర్క్ మాదిరిగానే హైస్పీడ్ ప్యాసింజర్ రైల్ కారిడార్న అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నం.
గరిష్ఠంగా గంటకు 350 కి.మీ వేగంతో రైలు ప్రయాణించేలా వాటి డిజైన్ ఉంటుంది. తద్వారా ప్యాసింజర్లకు సౌకర్యం, సమయం ఆదా అవుతుంది' అని తెలిపారు.