
విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో మొట్టమొదటి ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్. ఈ క్రమంలో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పేరుతో చంద్రబాబు, లోకేష్ లు ప్రచారం మానుకోవాలని అన్నారు. డేటా సెంటర్ తో ఉద్యోగాలు రావని అన్నారు అమర్నాథ్.
డేటా సెంటర్ కు భారీగా విద్యుత్, నీళ్లు అవసరమని..కూటమి ప్రభుత్వం డేటా సెంటర్ రూ. 22 వేల కోట్ల రాయితీలు ఇచ్చిందని అన్నారు. డేటా సెంటర్ తో 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని జీవోలో ఉంటే మంత్రులు మాత్రం 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారని అన్నారు. ఏ డేటా సెంటర్ తో కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగదని.. ఇది ఐటీ కంపెనీలు చెబుతున్న మాట అని అన్నారు అమర్నాథ్.
►ALSO READ | అదానీ భాగస్వామ్యంతో విశాఖలో గూగుల్ AI హబ్.. క్లీన్ ఎనర్జీతో మెగా డేటా సెంటర్
ఇదిలా ఉండగా.. విశాఖపట్నంలో ఏఐ హబ్ కోసం ఐదేళ్ళలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది గూగుల్. అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఏఐ హబ్ ఏర్పాటును సహకరించనున్నాయి.ఎయిర్టెల్, గూగుల్ సంయుక్తంగా విశాఖపట్నంలో పర్పస్ బిల్ట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నాయి.అంతే కాకుండా గూగుల్ కొత్త ఇంటర్నేషనల్ సబ్ సీ కేబుళ్లను హోస్ట్ చేసేందుకు అడ్వాన్స్డ్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనుంది.