వందేండ్ల గండిపేట్ కాలువకు లీకులు..పట్టించుకోని అధికారులు

వందేండ్ల గండిపేట్ కాలువకు లీకులు..పట్టించుకోని అధికారులు

వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన గండిపేట్ కాండ్యూట్ కాలువ లీకులకు గురవుతోంది.  ఈ కాలువ గండిపేట నుంచి నగరంలోని ఆసిఫ్ నగర్ కు శుద్ధి చేయని నీటిని తీసుకొస్తుంది. అక్కడ ఫిల్టర్ లో శుద్ధి చేసి నగరానికి తాగునీటి సరఫరా చేస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాలువకు కోకాపేట్, పుప్పాలగూడ, మణికొండ, షేక్ పేట వంటి పలుచోట్ల లీకేజీలు ఏర్పడి  నీరు వృధాగా పోతుంది.

స్థానిక అధికారులకు ఎన్నిసార్లు  ఫిర్యాదు చేసినా తాత్కాలిక మరమతులతో సరిపెడుతున్నారు తప్ప పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నాలా నుంచి నీటి సరఫరా నిలిపివేసి పూర్తిస్థాయిలో మరమ్మతులు జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. 

అయితే నగరానికి నీటి సరఫరా కు అంతరాయం ఏర్పడుతుందని పూర్తిస్థాయి మరమ్మతులను అధికారులు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు.  అధికారుల నిర్లక్ష్యం కాలువ ఉనికికే ముప్పు తెచ్చే విధంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని కండ్యూట్ కాలువ  పూర్తిస్థాయి  మరమ్మతులకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.