మిర్యాలగూడలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీ కొట్టిన కంటైనర్

మిర్యాలగూడలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీ కొట్టిన కంటైనర్

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  మిర్యాలగూడ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో అతివేగంతో వచ్చిన  కంటైనర్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న  ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హుటా హుటిన పోలీస్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరి 4న  సీఎం సభ నేపథ్యంలో విధులు నిర్వహించేందుకు వెళుతుండగా ఈ  ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో   ఫిబ్రవరి 4న మిర్యాలగూడ మండలం గూడురు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంది. సీఎం టూర్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.